పోస్ట్‌లు

జూన్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆదివాసి శతక సమీక్ష

పుస్త‌క స‌మీక్ష‌ "ఆదివాసి రాసిన ఆదివాసీ శ‌త‌కం" శ‌త‌కం అంటే మ‌న‌కు భ‌క్తి శ‌త‌కాలు, నీతి శ‌త‌కాలు, కొండొక‌చో శృంగార శ‌త‌కాలు గుర్తుకు వ‌స్తాయి. కానీ, అస్తిత్వ శ‌త‌కాలు అసలు లేవు అన‌వ‌చ్చు. కోసు ప్ర‌సాద‌రావు తూర్పు గోదావ‌రి జిల్లా, రంప‌చోడ‌వ‌రం మండ‌లం, బంద‌ప‌ల్లి ఆశ్ర‌మ పాఠ‌శాల ఉపాధ్యాయులు. "ఆదివాసీల‌" మీద శ‌త‌కం రాసిన వాళ్ళ‌లో మొద‌టివారై ఉంటారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు మొత్తం నాలుగు శ‌త‌కాలు ర‌చించారు. అవి (1) మాతృశ్రీ గండి పోశ‌మ్మ శ‌త‌కం, (2) శ్రీ షిర్డి సాయి శ‌త‌కం (3) శ్రీ రంప మ‌ల్లిఖార్జున శ‌త‌కం, (4) ఆదివాసి శ‌త‌కం, ఇంత‌కుముందు రాసిన మూడు ఆధ్యాత్మిక శ‌త‌కాలు అయితే జ‌న్మ‌తః ఆదివాసి అయిన‌వారు "ఆదివాసీల శ‌త‌కం" రాయ‌డం అభినంద‌నీయం. దీనిని వారి త‌ల్లి దండ్రుల‌కు అంకిత‌మిచ్చారు. ఆదివాసీల స్థితిగ‌తుల గురించిన సామాజిక అంశం పై రాసిన శ‌త‌కం ఇది. ఇందులో మొత్తం 108 ప‌ద్యాలున్నాయి. "మ‌కుటం ప‌ల్లెవాసి మాట పసిడి మాట" శ‌త‌కం ప్రారంభానికి ముందు అల్లూరి సీతారామ‌రాజుకు నివాళి అర్పించారు. ముందు మాట‌లు రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రి, బంద‌ప

సమూహం పై సమీక్ష

బహుజన సమీకరణకు ‘సమూహం’ BY EDITOR · JUNE 7, 2017 రచన: జ్వలిత డెంచనాల కులాల గుట్టు రట్టు చేసే మార్గం అంతర్‌ వివాహాలు మాత్రమే అని చెప్పారు అంబేద్కర్‌. అస్తిత్వవాదం ఇప్పుడు మొదయింది కాదు. జ్యోతిరావుపూలే తన రచను బోధన ద్వారా చేసినది అదే. పుట్టుకతో అందరూ సమానులే అయినా చదువు లేని కారణంగా బానిసలుగా, పాపులుగా భావించబడు శూద్ర, అతిశూద్రు సమానమని వారు ఐక్యంగా కలిసినపుడు ద్రోహపూరిత వ్యూహాను తిప్పికొట్టగలుగుతామని, కులం కన్న, మతం కన్న మానవత్వం గొప్పదని, విద్య అందించిన జ్ఞానం వల్లనే మానవీయత సాధ్యమని చాటిన గొప్ప మార్గదర్శకుడు. మరి పూలే రచను, బోధను మరుగున పెట్టిన కుట్రలు ఇప్పుడు బీసి అస్తిత్వ వాదుల ఐక్యతను కూడా చీల్చుతాయి. స్త్రీ విద్య మహా పాపమని కొన్ని వంద వే సం॥ల స్త్రీని విద్యకు, స్వేచ్ఛకు దూరంగా ఉంచిన బ్రాహ్మణ భావజాలం ఇప్పటికి మన బహుజనులను ప్రభావితం చేస్తూనే ఉంది. బీసీ కవులు ఏమి రాయాలి జరిగిన మోసాలు, ద్రోహాలు, జరుగుతున్న కుట్రల గురించి రాయగలగాలి, తేనె పూసిన కత్తుల వంటి ప్రచారాలను అడ్డుకునే చైతన్యాన్ని, జ్ఞానాన్ని కలిగించాలి. బీసీలు కాని ఇతర కవులు రాసిన బహుజన హిత సాహిత్యాన్ని చదవాలి. బీసీలు మన

సహనుభూతి కథ

"సహానుభూతి వెలిగించిన దీపం" జ్వలిత-9989198943 గిప్పుడు గీ పొల్ల‌ను ఎవ‌రు చూడాలె తాదూర కంత లేదు మెడ‌కో డోల‌న్నట్టున్నది మ‌న పొల్ల‌గాల్ల‌నే హాస్టలేస్తిమి గా ప్ర‌వీణ్ కుమార్ సార్ పుణ్య‌మా మ‌న పోర‌ల్ల‌కు స‌ద‌వుకు ద‌క్కుతుంది. మ‌నం గీ చెప్పుల కొట్టు మీద బ‌తుకుడే ఎక్కువ‌. స‌ణుగుత‌నే ఉన్న‌ది సుగుణ‌. ఎవ‌రో క‌ష్ట‌మ‌రొచ్చిండు షూ పాలిష్ చెయ్య‌మ‌ని బ‌ండి టైం అయితాంద‌ని తొంద‌ర పెట్టుకుంట మూడు జ‌త‌ల బూట్లు ముందేసిండు. "స‌దువుడాపి గీ బూట్లు ఒక జోడి పాలిస్ పెట్టు నేను గూడ పెడ‌త జ‌ప్పునయిత‌ది లేదంటే తాత‌కు తిట్లు ప‌డ‌త‌యి" అన్న‌డు కాశ‌య్య‌. తానొక బూటు చేతిల‌కి తీసుకొని. "బాబ్బాబు చ‌చ్చి నీ క‌డుపున పుడ‌త త్వ‌ర‌గ చేసియ్యి ఇల్లంత పందిరేస్తున్న‌రు పిల్ల‌లు" అన్న‌డు బూట్లు తెచ్చిన ముస‌లాయ‌న‌. "ఆ, మా క‌డుపున పుట్టి ఏం బావుకుంట‌వ్, పెద్ద మ‌నిషి చెప్పులు కుడ‌త‌వా ఆక‌లికి మాడ‌త‌వా" ఇసురుకున్న‌ది సుగుణ‌. "అదేంట‌మ్మా మీ పిల్ల‌లు పోయిన‌ట్లు హాస్ట‌లుకు పోతా, బాగా చ‌దువుతా, మీ క‌ష్టాలు తీరుస్తా" ఆ
బహిష్కరణ పిశాచాలు నన్ను బహిష్కరించాయ వేల సంవత్సరాల నాడు బహిష్టు పేరున మనువు పురుషులు బహిష్కరించారు న స్త్రీ స్వాతంత్రమర్హతే అని తండ్రులు అన్నలు తమ్ములు కూడా ఆడపిల్లవు ఆడిపిల్లవు అంటూ హక్కుల రెక్కలు కత్తిరించారు వ్యూహాల ఉయ్యాల మరిగి బహుజనుడొకడు వెలి వేశాడు నా ప్రశ్న వాడి అహానికి కొరివి పెట్టిందని బానిసకు బానిసొకడు బహిష్కరణ పాటందుకున్నడు నా అస్తిత్వ గళం విచ్చుకత్తై వాడి అజ్ఞానాన్ని చీల్చ బోతుందని రబ్బరు స్టాంపొకటి కొవ్వుముక్కలను పోగేసి నూనెపాఠాలకు దూరంగా నన్ను వెలి వేసానంది సామాజిక సమన్యాయం సొల్లుమాటలతొ అమాయకులను మాయ చేసే నల్ల కోటొకటి ఎడమ చేయి నరుకుతుంటె చేటు పాటు ఎరుగని కుడిచేయి చంకలు బాదుకుంటుంది యుగాలనాటి మానవత్వం చిటారుకొమ్మన అందని ద్రాక్షయ్యింది మనువాదం మారాకు తొడిగి అంబేద్కరును పూలేను వల్లె వేస్తున్నది అనాదిగా వెలి వేయబడ్డ నేను అక్షరాలను వెలిగించి అందకారానందాన్ని తగల బెడుతున్నాను నా వెంట ఆత్మవిశ్వాసపు అన్నలు ఆత్మాభిమానపు అక్కలు పూలు మొగ్గలు నా సైన్యం కాంతి విత్తులు ఎవరైనా ఎత్తుకోవచ్చు మళ్ళీ విత్తుకోవచ్చు వెలుతురు పంట అందరిదీ ప్రశ్నల ఆయుధాలతో హక్కుల యుద్దం ఎప్పడికీ
ప‌డిలేచిన క‌డ‌లి త‌రంగం - “అభిన‌వ మొల్ల” డా. చ‌క్ర‌వ‌ర్తుల ల‌క్ష్మీన‌ర్స‌మ్మ‌, భ‌ద్రాచ‌లం ఆమె జీవితం రాళ్ళ‌లో చిలికిన సెల‌యేరు. దానిని పావ‌న గోదావ‌రిగా మార్చుకుందామె. ఆమె ప‌డిలేచిన ఒక క‌డ‌లి త‌రంగం! రాముడు వెల‌సిన భ‌ద్రాచ‌లం రాజ‌వీధిలో ఆమె అక్ష‌ర రాణి సౌర‌భ‌ వాణి. బాధ‌ల‌ను ధిక్క‌రించిన వెలుగు ఆమె క‌విత్వం! ఆమె “అభిన‌వ మొల్ల‌” బిరుదాంకితురాలు డా. చ‌క్ర‌వ‌ర్తుల ల‌క్ష్మీనర‌స‌మ్మ‌. శ్రీ పొడిచేటి వీర రాఘ‌వాచార్యులు, శ్రీ‌మ‌తి న‌ర‌స‌మాంబ దంప‌తుల రెండ‌వ సంతానంగా 1939 జ‌న‌వ‌రి 3వ తేదీన ఆమె జ‌న్మించింది. తండ్రిగారు ఆగ‌మ‌శాస్త్ర పండితులు. భ‌ద్రాచ‌ల శ్రీ సీతారామచంద్ర‌స్వామి ఆల‌యంలో 60 సంవ‌త్సారాలు ప్ర‌ధానార్చ‌క ప‌ద‌విలో సేవ‌లందించిన మ‌హ‌నీయుడు. ఉదాత్త చ‌రితుడు. అజాత శ్ర‌తువు అంటారు అంద‌రు. ఆరుగురు సోద‌రీమ‌ణులు, న‌లుగురు సోద‌రుల‌కు ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు పంచి జీవితానుభ‌వాల నిఘంటువులో ప్రేమ అనే రెండ‌క్ష‌రాల‌కు అర్థం ఆమె. వారిది స‌నాత‌న కుటుంబం. 9 సంవ‌త్స‌రాల‌కే వివాహం జ‌రిపించారు. శార‌దా బిల్లు చ‌ట్టం ఉన్న ఆ స‌మ‌యంలో ఆమె వివాహం ర‌హ‌స్యంగానే జ‌రిగింది. అత్త‌, ఆడ‌ప‌డుచుల ఆర‌ళ్ళ‌తో అత్త‌వారింట
THURSDAY, JANUARY 7, 2010 బాంబులు పేలుతున్నాయి తెలంగాణ బతుకులు బాంబులు POSTED BY జ్వలిత AT 1:34 AM 1 COMMENT: pelutunnayi POSTED BY జ్వలిత AT 12:15 AM NO COMMENTS: shoonyam దేహం దాహం శూన్యం శృంగారం POSTED BY జ్వలిత AT 12:15 AM 1 COMMENT: WEDNESDAY, DECEMBER 30, 2009 తరుణం ఎదిగి ఒదుగుతూ కరుగుతున్న తరుణం చిరు జల్లు కోరుకున్నా .. మంచువాన కురిపిస్తే తట్టుకోలేక వణుకుతున్నా వెచ్చని స్పర్శల చినుకు జీవితాన్ని యిస్తున్దనుకున్న శీతల శవ స్పర్స పాల రాతి సమాధి కట్టింది ఇప్పుడు నేనొక తాజమహల్ని నా చుట్టూ ప్రేమ సందర్శకులు ఎడతెగని అన్వేషణ నేను నీకు అనునిత్య స్వాగత తోరణం POSTED BY జ్వలిత AT 11:54 PM 1 COMMENT: TUESDAY, DECEMBER 29, 2009 ఆకాశం ఒక అవకాశం శూన్యాకాశం అనేకావసరాలు ఆకాశమంటే అవకాశమా..? POSTED BY జ్వలిత AT 8:38 PM NO COMMENTS: WEDNESDAY, DECEMBER 23, 2009 వేటాడే చేపలు చెరువు అమ్ముడుపోయింది చేపలు వేట వెతనేర్చుకోవాలి POSTED BY జ్వలిత AT 1:08 AM 1 COMMENT: TUESDAY, DECEMBER 22, 2009 కరువు చెట్టే పిందేలమ్ముకుంటుంది పండ్లకు కరువు POSTED BY జ్వలిత AT 12:16 AM NO COMMENTS:
ఆకాశం ఒక అవకాశం శూన్యాకాశం అనేకావసరాలు ఆకాశమంటే అవకాశమా..? POSTED BY జ్వలిత AT 8:38 PM NO COMMENTS: WEDNESDAY, DECEMBER 23, 2009 వేటాడే చేపలు చెరువు అమ్ముడుపోయింది చేపలు వేట వెతనేర్చుకోవాలి POSTED BY జ్వలిత AT 1:08 AM 1 COMMENT: TUESDAY, DECEMBER 22, 2009 కరువు చెట్టే పిందేలమ్ముకుంటుంది పండ్లకు కరువు POSTED BY జ్వలిత AT 12:16 AM NO COMMENTS: TUESDAY, DECEMBER 8, 2009 శూన్యాకాశం శూన్యాకాశం దివ్యత కలిగి దైవం కావచ్చు విద్య వల్ల పుంభావ సరస్వతి కావచ్చు స్వరూపం అపర మన్మదునివేమో ఐశ్వర్యం లో లక్ష్మీ పుత్రునివేమో మరేమో ఇంకేమో ఏమేమో కవచ్చేమో అధికారం తో వచ్చిన అహం అగు గాక పొగడ్తల వల్ల వచ్చిన పొగరు అగు గాక గెలిచానని మోసగించానని గేలి సేతివేమో అనుభవించి అనుబంధం తుంచుకున్నందుకు ఆనందమేమో అభిమానాన్ని గుర్తించ లేని కీటక ధర్మం నాకు నువ్వు వద్దు వద్దు వద్దు క్రిములతో క్రీడలు వద్దు నీ నీడల చాయలు నాకు వద్దు శూన్యాకాశం నాకు ముద్దు POSTED BY జ్వలిత AT 1:59 AM 2 COMMENTS: SUNDAY, OCTOBER 11, 2009 నిప్పుల గుండం ఎన్ని చల్లిన చల్లారడం లేదు ఎందుకు ? ఏమిటది ? చల్లేది కన్నీళ్లు మండేది " నిప్
ఆకాశం ఒక అవకాశం శూన్యాకాశం అనేకావసరాలు ఆకాశమంటే అవకాశమా..? POSTED BY జ్వలిత AT 8:38 PM NO COMMENTS: WEDNESDAY, DECEMBER 23, 2009 వేటాడే చేపలు చెరువు అమ్ముడుపోయింది చేపలు వేట వెతనేర్చుకోవాలి POSTED BY జ్వలిత AT 1:08 AM 1 COMMENT: TUESDAY, DECEMBER 22, 2009 కరువు చెట్టే పిందేలమ్ముకుంటుంది పండ్లకు కరువు POSTED BY జ్వలిత AT 12:16 AM NO COMMENTS: TUESDAY, DECEMBER 8, 2009 శూన్యాకాశం శూన్యాకాశం దివ్యత కలిగి దైవం కావచ్చు విద్య వల్ల పుంభావ సరస్వతి కావచ్చు స్వరూపం అపర మన్మదునివేమో ఐశ్వర్యం లో లక్ష్మీ పుత్రునివేమో మరేమో ఇంకేమో ఏమేమో కవచ్చేమో అధికారం తో వచ్చిన అహం అగు గాక పొగడ్తల వల్ల వచ్చిన పొగరు అగు గాక గెలిచానని మోసగించానని గేలి సేతివేమో అనుభవించి అనుబంధం తుంచుకున్నందుకు ఆనందమేమో అభిమానాన్ని గుర్తించ లేని కీటక ధర్మం నాకు నువ్వు వద్దు వద్దు వద్దు క్రిములతో క్రీడలు వద్దు నీ నీడల చాయలు నాకు వద్దు శూన్యాకాశం నాకు ముద్దు POSTED BY జ్వలిత AT 1:59 AM 2 COMMENTS: SUNDAY, OCTOBER 11, 2009 నిప్పుల గుండం ఎన్ని చల్లిన చల్లారడం లేదు ఎందుకు ? ఏమిటది ? చల్లేది కన్నీళ్లు మండేది " నిప్
వితం విలువ తెలిసేది కోట్ల సమూహాలకు చేతి కర్రయితేనే కంటి దివ్వెను వెలిగించినపుడే జీవన సౌందర్యం గోచరమయ్యేది జీవన పోరాటం లో సమిధమయినపుడే మరణం మరీ ప్రియమై శాశ్వత మనుగడ మిగిలేది POSTED BY జ్వలిత AT 4:38 AM NO COMMENTS: SUNDAY, JULY 18, 2010 వేదికలపై అస్తిత్వాలు - ఆంధ్రజ్యోతిలో వ్యాసం Posted by Picasa http://www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2010/jul/19/vividha/19vividha3&more=2010/jul/19/vividha/vividhamain&date=7/19/2010 POSTED BY జ్వలిత AT 9:38 PM NO COMMENTS: LABELS: VYAASAALU MONDAY, JANUARY 25, 2010 సుదీర్ఘ హత్య పుస్తకావిష్కరణ POSTED BY జ్వలిత AT 7:12 AM 1 COMMENT: LABELS: సాహిత్య కార్యక్రమాలు THURSDAY, JANUARY 7, 2010 బాంబులు పేలుతున్నాయి తెలంగాణ బతుకులు బాంబులు POSTED BY జ్వలిత AT 1:34 AM 1 COMMENT: pelutunnayi POSTED BY జ్వలిత AT 12:15 AM NO COMMENTS: shoonyam దేహం దాహం శూన్యం శృంగారం POSTED BY జ్వలిత AT 12:15 AM 1 COMMENT: WEDNESDAY, DECEMBER 30, 2009 తరుణం ఎదిగి ఒదుగుతూ కరుగుతున్న తరుణం చిరు జల్లు కోరుకున్నా .. మంచువాన కురిప
తూరుపు రేఖై ఎదిగి రావమ్మ/జ్వలిత చెల్లీ తల్లీ ఓ నాగమల్లీ నాగుపామువై బుసకొట్టవమ్మా అమ్మా కొమ్మా మందార రెమ్మా రణశంఖమై మారు మోగవమ్మా 1)కిల కిల నవ్వులు ఆ..ఆ..ఆ.. పెనుశోకలైతే ఓ..ఓ..ఓ.. పట్ట పగలే పట్ట పగ్గాల్లేక నిట్టనిలువున కాలుస్తూంటే నిర్దయగా కోలుస్తూంటే //చెల్లీ// 2)నవ్వుల వనాలు ఆ..ఆ..ఆ.. కదలే నరకాలైతే ఓ..ఓ..ఓ.. కనురెప్పలు కాటేస్తుంటే కనుపాపలే నెత్తురోడెనమ్మా కన్న పాపలే కడలి పాలయిరమ్మా //చెల్లీ// 3)కన్నులు మెరుపులు ఆ..ఆ..ఆ.. చీకటి మడుగులైతే ఓ..ఓ..ఓ.. పశువులు కూడాపరితపించెనమ్మా మనువు కానందుకు సంతసించెనమ్మా మనిషిగ పుట్టనందుకు మురిసిపోయెనమ్మా //చెల్లీ/ 4)గలగలమాటలు ఆ..ఆ..ఆ.. సలసలసలుపుతూంటేఓ..ఓ..ఓ.. వంట్ల్లు సొంతిల్లు ఆక్రమణల అర్ణవమైతే పక్షులు కోడా దుఖపడ్డవమ్మా రెక్కలిప్పి దికూల సాగెనమ్మా //చెలీ// 08/02/2013(10.20ప్మ్) ఇంకా ఉన్నది.............. POSTED BY జ్వలిత AT 8:00 AM NO COMMENTS:
బానిసకు బానిస బానిసకు బానిస/ జ్వలిత నేను శత్రు శిబిరం లో శరణార్థిని నా జీవితం నిర్ణయాత్మక వెలివాడ నా గాయం తడి ఆరిన ఎడారి నా గళం అనివార్య యుద్దాల నడుమ ఆత్మగౌరవ గీతాలాపన నా కలం అస్తిత్వ ప్రసవాల ఆర్తనాదం నాకు పాఠకులుండరు ప్రేక్షకులు కూడా ఉండరు నిత్యం పహారా కాస్తూ శత్రు సైన్యం నా చుట్టూ నా అవసరాల ఉనకి ఉండదు నా హక్కుల చర్చ ఉండదు నా ఊహలను, వ్యూహాలను దోచుకొని మరొకరి విజయ గాథల ప్రచారం నిత్యం సముద్ర ఘోష నడుమ నా బృందం భజన నా నాయకుడు చెంచాలకు గ్లాసులందిస్తూ ఒకసారి గాజులందిస్తూ మరొకసారి మురికి గుంటల్లో దొర్లుతుంటాడు నా సహచర బృందం అరమోడ్పు కన్నులతో నా చరిత్రను తాకట్టు పెడుతూ జాతర చేస్తారు నేను శత్రు శిబిరంలో శరణార్థిని(saranaardhi) నేనొక బానసకు బానిసను నేనొక బీసీని ------===--------- జ్వలిత- 9989198943 13/04/2016,(3.30pm) POSTED BY జ్వలిత AT 9:06 AM NO COMMENTS:
బానిసకు బానిస బానిసకు బానిస/ జ్వలిత నేను శత్రు శిబిరం లో శరణార్థిని నా జీవితం నిర్ణయాత్మక వెలివాడ నా గాయం తడి ఆరిన ఎడారి నా గళం అనివార్య యుద్దాల నడుమ ఆత్మగౌరవ గీతాలాపన నా కలం అస్తిత్వ ప్రసవాల ఆర్తనాదం నాకు పాఠకులుండరు ప్రేక్షకులు కూడా ఉండరు నిత్యం పహారా కాస్తూ శత్రు సైన్యం నా చుట్టూ నా అవసరాల ఉనకి ఉండదు నా హక్కుల చర్చ ఉండదు నా ఊహలను, వ్యూహాలను దోచుకొని మరొకరి విజయ గాథల ప్రచారం నిత్యం సముద్ర ఘోష నడుమ నా బృందం భజన నా నాయకుడు చెంచాలకు గ్లాసులందిస్తూ ఒకసారి గాజులందిస్తూ మరొకసారి మురికి గుంటల్లో దొర్లుతుంటాడు నా సహచర బృందం అరమోడ్పు కన్నులతో నా చరిత్రను తాకట్టు పెడుతూ జాతర చేస్తారు నేను శత్రు శిబిరంలో శరణార్థిని(saranaardhi) నేనొక బానసకు బానిసను నేనొక బీసీని ------===--------- జ్వలిత- 9989198943 13/04/2016,(3.30pm) POSTED BY జ్వలిత AT 9:06 AM NO COMMENTS:

మేమెవరం

memevaram మేమెవరం/ జ్వలిత మీకు కడకో నడిమిట్లనో గూడో మేడో ఏదో ఒకటున్నది నిలవ నీడ లేనోళ్ళం దేశదిమ్మరులం మా సంగతేంది ఎర్రదో తెల్లదో ఏదో ఒక కారటున్నది బత్తెమిచ్చటందుకు ఏ కార్డు లేనోల్లం సంచార జాతులం మా బతుకేంది చిన్నదో పెద్దదో ఏదో ఒక కొలువున్నది మీకు బతుకు తెరువుకు ఏదిలేని బహురూపు గాళ్ళం మా ఉనికేంది మీకు కోడో మేకో చివరాకరికి సూకరమో ఉన్నది పసందుగ విందులు చేసేందుకు అడవి పచ్చులు గూడ దొరకని పిట్టలోళ్ళం బతికేదెట్ల మేం అన్నమెతక్కు కరువు అచ్చరమెట్ల దొరుకుతది మాకు అడ్రసు లేనోళ్ళం ఆధారెక్కడుంటది మాకు ఓటు లిష్ట్ లేనోళ్ళం జనాభాలెక్కల ఎట్లుంటం అప్పు కింద అమ్ముతడొకడు ఖర్చుల కింద జమేస్తడొకడు తప్పు కింద కాలె నూనెల కాలుస్తడొకడు సాదలేక సంపుతడొకడు కట్టుబాటంటడొకడు కులం తీరంటడొకడు కట్టుకున్నోడు కన్నోడు కంటపడ్డ ప్రతోడు మా పాలి యములోళ్ళే మాకే చట్టం లేదు ఏ చట్టు బండల్లేవ్ మేము ఈ దేశపోళ్ళం కామా? మాది ఏ దేశం? మాకు న్యాయం చేసేదెవరు? అంబేద్కర్ మాకు లేడా? పూలే ది మా వాడ కాదా? బుద్దుడి ధర్మం మాకు చెందదా? గంగిరెద్దులోళ్ళ పిచ్చకుంట్లం భోగమోళ్ళం పూసలోళ్ళం మందులోళ్థం కాటి కాపరులం బైండ్లోళ్ళం డెక్కలోళ్ళం బండొడ్డెరోళ్