బహిష్కరణ పిశాచాలు నన్ను బహిష్కరించాయ వేల సంవత్సరాల నాడు బహిష్టు పేరున మనువు పురుషులు బహిష్కరించారు న స్త్రీ స్వాతంత్రమర్హతే అని తండ్రులు అన్నలు తమ్ములు కూడా ఆడపిల్లవు ఆడిపిల్లవు అంటూ హక్కుల రెక్కలు కత్తిరించారు వ్యూహాల ఉయ్యాల మరిగి బహుజనుడొకడు వెలి వేశాడు నా ప్రశ్న వాడి అహానికి కొరివి పెట్టిందని బానిసకు బానిసొకడు బహిష్కరణ పాటందుకున్నడు నా అస్తిత్వ గళం విచ్చుకత్తై వాడి అజ్ఞానాన్ని చీల్చ బోతుందని రబ్బరు స్టాంపొకటి కొవ్వుముక్కలను పోగేసి నూనెపాఠాలకు దూరంగా నన్ను వెలి వేసానంది సామాజిక సమన్యాయం సొల్లుమాటలతొ అమాయకులను మాయ చేసే నల్ల కోటొకటి ఎడమ చేయి నరుకుతుంటె చేటు పాటు ఎరుగని కుడిచేయి చంకలు బాదుకుంటుంది యుగాలనాటి మానవత్వం చిటారుకొమ్మన అందని ద్రాక్షయ్యింది మనువాదం మారాకు తొడిగి అంబేద్కరును పూలేను వల్లె వేస్తున్నది అనాదిగా వెలి వేయబడ్డ నేను అక్షరాలను వెలిగించి అందకారానందాన్ని తగల బెడుతున్నాను నా వెంట ఆత్మవిశ్వాసపు అన్నలు ఆత్మాభిమానపు అక్కలు పూలు మొగ్గలు నా సైన్యం కాంతి విత్తులు ఎవరైనా ఎత్తుకోవచ్చు మళ్ళీ విత్తుకోవచ్చు వెలుతురు పంట అందరిదీ ప్రశ్నల ఆయుధాలతో హక్కుల యుద్దం ఎప్పడికీ ******-*-*----*-*-****** జ్వలిత- 9989198943 20-04-2017

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

జిల్లేడు కాయ(కరోనా కథ))