పోస్ట్‌లు

ఆగస్టు, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

స్త్రీ ఎందుకు బానిసైంది?

చిత్రం
స్త్రీ ఎందుకు బానిసైంది? – ముళ్ళ కంచెల మూలాలు BY  EDITOR  · AUGUST 1, 2017 రచన: జ్వలిత భార‌తదేశానికి స్వాతంత్య్రం రాక ముందు, స్త్రీవాదం గురించిన ఆలోచ‌న భార‌త‌దేశంలో మొల‌కెత్త‌క ముందే 1942లోనే “స్త్రీ ఎందుకు బానిసైంది”. అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తి చ‌ర్చించి వివ‌ర‌ణనిచ్చారు “ఆత్మ గౌర‌వ ఉద్య‌మకారుడు” యాక్టివిస్ట్ ఈరోడ్ వెంక‌ట‌ప్ప రామ‌స్వామి పెరియార్‌. వారు ఆంగ్లంలో రాసిన “Why were women Enslaved” ర‌చ‌న‌కు తెలుగు సేత ఎ.జి. య‌తిరాజులు చేయ‌గా ప్ర‌జాశ‌క్తి బుక్ హౌస్ వారు 2010లో ప్ర‌చురించారు. క‌వ‌రు పేజీతో క‌లిపి 52పేజీల పుస్త‌కం. ఇందులో మొత్తం ప‌ది అధ్యాయాలు ఉన్నాయి. మొద‌టి అధ్యాయంలో “శీలం పాతివ్ర‌త్యం” ‘శీలం’ అనే ప‌దానికి నాశ‌నం లేనిది దృఢ‌మైన‌ది అనే నిఘంటు అర్థాలున్నాయి. కానీ, శీలం అనే ప‌దాన్ని కేవ‌లం స్త్రీల‌కు మాత్ర‌మే సంబంధించిన‌దిగా వాడ‌టాన్ని ప్ర‌స్తావిస్తారు ర‌చ‌యిత‌. ‘చెస్టిటీ’, ‘వ‌ర్జినిటీ’వంటి స‌మానార్థాల ప‌రిశీల‌న‌తో ఆడ మ‌గ క‌లియిక‌కు సంబంధంలేని ప‌రిశుభ్ర‌త‌, ప‌విత్ర‌త‌కే ఈ ప‌దానికున్న విస్తృతార్థంగా చెప్పారు. అయితే సంస్కృత భాషా ప‌దాల‌ను ప‌రిశీలించిన‌పుడు శీలానికి బానిస అనే