శిశిరోన్ముఖం(కథ)
శిశిరోన్ముఖం జ్వలిత "ఒరే పవన్ మీ పెళ్ళెప్పుడురా…?" శీను. "ఏమో మామా నాకీజీవితంల పెళ్ళిరాతలేనట్టుంది. అనిత పెళ్ళొద్దంటున్నది" దిగులుగా అన్నడు పవన్. " అదేంటిరా.. ప్రేమించుకున్నమంటివి కదా.. పెళ్లి ఎందుకు వద్దట? విచిత్రాల పిల్లలురా మీరంతా.." విసుక్కున్నడు పవన్ మామ శీను. "విచిత్రం ఏమీ లేదు.. అనితకు పెళ్ళంటె ఇష్టం లేదు.." పౌరుషంగా జవాబిచ్చిండు మేనల్లుడు పవన్. "అంటే.. పెళ్ళి లేకుంట కలిసుంటరా? వాళ్ళోళ్ళు ఒప్పుకుంటరా? మీ అమ్మ నాయన ఊకుంటరా ? నన్ను ఇరికించకొరేయ్.." భయంగా అన్నడు శీను. "కలిసుంటె తప్పేంది ? కోర్టు కూడా 'సహజీవనం' న్యాయ సమ్మతమే అన్నదికదా ! అయినా అనిత కలిసి ఉండదు, పెండ్లి చేసుకోదు. ఇందుల నిన్ను ఇరికిచ్చుడేమి లేదులే.." నసిగిండు పవన్. "అబ్బ.. ఏందిరా నీ గోల? సరిగ చెప్పు" పంచర్ ఏస్తున్న సైకిల్ ట్యూబ్ నీళ్ళల్ల వదిలి వచ్చి, పవన్ పక్కన సిమెంట్ అరుగు మీద కూసున్నడు శీను. మళ్లీ తనే "పెళ్ళి చేసుకోరు, కలిసుండరు.. ఉత్తగనే ప్రేమ పచ్చులోతిగ జీవితమంతా.. షికార్లు తిరుగుతరా" చతురాడిండు . "నీకు పరాసికం అయితంది......