ది హౌస్ ఆఫ్ స్పిరిట్ నవల
మెరిసే అక్షర ాలు (ప్రపంచ సాహిత్యంలో చదవదగిన నవలలు) జ్వలిత: 9989198943. 'ద హౌస్ ఆఫ్ స్పిరిట్స్' నవలా పరిచయం ద హౌస్ ఆఫ్ ది స్పిరిట్ అనే నవల 1982లో ఇసాబెల్ అలెండా అని ఒక జర్నలిస్ట్ మరియు టెలివిజన్ హోస్ట్ అయిన మహిళ యొక్క రచన. ఆమె చైనా నుండి రాజకీయ బహిష్కృతురాలు. 1981 జనవరి 8 వ తేదీన వెనిజులాలో కూర్చొని దాదాపు వంద సంవత్సరాల వృద్ధుడైన తన తాతకు లేఖ రాయడం ప్రారంభించింది. అందులో ఆమె తన వర్తమానానికి తన కుటుంబం యొక్క గతానికి మధ్య ఉన్న దూరాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. తన చిన్నతనంలో విన్న ఒక పిట్ట కథతో నవల మొదలవుతుంది. రోజా అనే ఒక స్త్రీ తన గురించి చెప్పినట్టుగా. రోజా పొరపాటున విషపూరితమైనట్టు రాసింది. 'పోస్ట్ చేయని ఉత్తరాలు' అనే నవల చేతి ప్రతి " the house of the spirit"గా మారి ఒక ఉత్తమ నవలగా రూపుదిద్దుకున్నది. ఒక స్త్రీ యొక్క మూడు తరాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి స్పష్టంగా చిత్రించింది రచయిత్రి ఈ నవలలో. స్త్రీలకు వ్యతిరేకంగా చిలీదేశం యొక్క అస్థిరత వెనుకబాటుతనాన్ని, 20వ శతాబ్ది యొక్క హింసాత్మక రాజకీయ దృక్పధాన్న, ఈ పుస్తకం పరిచయం చేస్తు...