ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ
2020 సంవత్సరం "'కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం" గెల్చుకున్న మానస ఎండ్లూరితో జ్వలిత చేసిన ఇంటర్వూ 1.జ్వలిత : కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన మీకు ముందుగా శుభాకాంక్షలు. ఈ పురస్కారం పొందిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ? మానస ఎండ్లూరి : ఈ పురస్కారం పొందిన అందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అయితే దీన్ని గుర్తింపు అనే కంటే కూడా గౌరవం అనుకుంటున్నాను. ఎందుకంటే అస్తిత్వాన్ని రాసుకునే రచయితలకు వచ్చే గుర్తింపు, గౌరవం ఆ రచయితకే కాదు తన జాతికి తన వర్గానికి వర్తిస్తుందని నమ్మేదాన్ని. ఒక స్త్రీవాదిగా, ఒక బహుజన వాదిగా, ఒక దళిత వాదిగా అట్టడుగు వర్గాల స్త్రీల గురించి ఆ వర్గపు.. ముఖ్యంగా దళిత క్రైస్తవ మనుషుల గురించి నేను రాస్తున్నాను కాబట్టి ఈ పురస్కారం అనేది ప్రతి ఒక్కరిని గౌరవిస్తుందని నేను భావిస్తున్నాను మేడం. 2. జ్వలిత : చాలా గొప్ప భావన, వ్యక్తిగతంగా కాకుండా, అస్తిత్వ స్పృహతో చాలా గొప్పగా ఉంది మీ సమాధానం. విహంగ పత్రిక బాధ్యత, విహంగ పత్రికలో మీ సాహిత్యం గురించి చెప్పండి ? మానస ఎండ్లూరి : విహంగ అనేది అంతర్జాలంలో మొట్టమొదటి మహిళా సాహిత్య పత్రిక. అది 2011ల...