పోస్ట్‌లు

ప్రత్యామ్నయం( కథ)

ప్రత్యామ్నయం మప్పయి సంవత్సరాలు టీచరు ఉద్యోగం చేసి రిటైర్ అయిన  సుబ్బయ్యకు పెళ్ళియిన దగ్గర నుండి వేరే ఊళ్ళో ఉండే కొడుకు పిల్లలకు మధ్య చనువు తక్కువ. సంవత్సరానికి ఒక సారి వాళ్ళు తన దగ్గరకొచ్చినా, ఆ ఒక్కరోజు రెండు రోజులు తను వాళ్ళ దగ్గరకు పోయినా పిల్లల పరిస్థితి అంతే. రిటైర్ అయినంక గమనిస్తే చిన్న మనవడు చదువులో వెనుక బడి ఉన్నాడు. గరాబం ఎక్కువ. టీవీల 'డోరోమెన్' కర్టూన్ చూడటం యిష్టం. నేను వాడికి చదువు చెప్పనా అంటే నీకు వాడికి చెప్పడం రాదులే అన్నాడు కొడుకు. మనవడికి చదువు అంటే తల్లి మాట వినడు. తండ్రికి తీరికుండదు. మెల్లగా చిన్న బోర్డ్ మీద చిన్న చిన్న బొమ్మలేసి అక్షరాల మీద ఆసక్తి కలిగించాడు. మనవనికి కూడా బొమ్మలు గీయడం ఇష్టం. కథలు చెప్తూ  అందులో వచ్చే పదాలకు బొమ్మలు గీస్తూ అక్షరాలు నేర్చుకొనేవాడు. తాతా మనవల మధ్య బెరుకు తగ్గింది. బడికి  వెళ్ళేపుడు బై తాతయ్యా అని‌, బడి నుండి రాగానే తాతయ్యా అంటూ దగ్గరికొచ్చే వాడు. ఒక రోజు హోమ్ వర్క్ పుస్తకంలో parts of the body అని రాసి ఉన్నాయి. నోస్ ఇయర్ ఐ అన్నీ చెపుతున్నాడు మనవడు రాయడానికి spellings రావట్లేదు. మూడింటికి మనవడు బడి నుండి వచ్చే సర...

ఆదివాసి శతక సమీక్ష

పుస్త‌క స‌మీక్ష‌ "ఆదివాసి రాసిన ఆదివాసీ శ‌త‌కం" శ‌త‌కం అంటే మ‌న‌కు భ‌క్తి శ‌త‌కాలు, నీతి శ‌త‌కాలు, కొండొక‌చో శృంగార శ‌త‌కాలు గుర్తుకు వ‌స్తాయి. కానీ, అస్తిత్వ శ‌త‌కాలు అసలు లేవు అన‌వ‌చ్చు. కోసు ప్ర‌సాద‌రావు తూర్పు గోదావ‌రి జిల్లా, రంప‌చోడ‌వ‌రం మండ‌లం, బంద‌ప‌ల్లి ఆశ్ర‌మ పాఠ‌శాల ఉపాధ్యాయులు. "ఆదివాసీల‌" మీద శ‌త‌కం రాసిన వాళ్ళ‌లో మొద‌టివారై ఉంటారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు మొత్తం నాలుగు శ‌త‌కాలు ర‌చించారు. అవి (1) మాతృశ్రీ గండి పోశ‌మ్మ శ‌త‌కం, (2) శ్రీ షిర్డి సాయి శ‌త‌కం (3) శ్రీ రంప మ‌ల్లిఖార్జున శ‌త‌కం, (4) ఆదివాసి శ‌త‌కం, ఇంత‌కుముందు రాసిన మూడు ఆధ్యాత్మిక శ‌త‌కాలు అయితే జ‌న్మ‌తః ఆదివాసి అయిన‌వారు "ఆదివాసీల శ‌త‌కం" రాయ‌డం అభినంద‌నీయం. దీనిని వారి త‌ల్లి దండ్రుల‌కు అంకిత‌మిచ్చారు. ఆదివాసీల స్థితిగ‌తుల గురించిన సామాజిక అంశం పై రాసిన శ‌త‌కం ఇది. ఇందులో మొత్తం 108 ప‌ద్యాలున్నాయి. "మ‌కుటం ప‌ల్లెవాసి మాట పసిడి మాట" శ‌త‌కం ప్రారంభానికి ముందు అల్లూరి సీతారామ‌రాజుకు నివాళి అర్పించారు. ముందు మాట‌లు రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రి, బంద‌ప...

సమూహం పై సమీక్ష

బహుజన సమీకరణకు ‘సమూహం’ BY EDITOR · JUNE 7, 2017 రచన: జ్వలిత డెంచనాల కులాల గుట్టు రట్టు చేసే మార్గం అంతర్‌ వివాహాలు మాత్రమే అని చెప్పారు అంబేద్కర్‌. అస్తిత్వవాదం ఇప్పుడు మొదయింది కాదు. జ్యోతిరావుపూలే తన రచను బోధన ద్వారా చేసినది అదే. పుట్టుకతో అందరూ సమానులే అయినా చదువు లేని కారణంగా బానిసలుగా, పాపులుగా భావించబడు శూద్ర, అతిశూద్రు సమానమని వారు ఐక్యంగా కలిసినపుడు ద్రోహపూరిత వ్యూహాను తిప్పికొట్టగలుగుతామని, కులం కన్న, మతం కన్న మానవత్వం గొప్పదని, విద్య అందించిన జ్ఞానం వల్లనే మానవీయత సాధ్యమని చాటిన గొప్ప మార్గదర్శకుడు. మరి పూలే రచను, బోధను మరుగున పెట్టిన కుట్రలు ఇప్పుడు బీసి అస్తిత్వ వాదుల ఐక్యతను కూడా చీల్చుతాయి. స్త్రీ విద్య మహా పాపమని కొన్ని వంద వే సం॥ల స్త్రీని విద్యకు, స్వేచ్ఛకు దూరంగా ఉంచిన బ్రాహ్మణ భావజాలం ఇప్పటికి మన బహుజనులను ప్రభావితం చేస్తూనే ఉంది. బీసీ కవులు ఏమి రాయాలి జరిగిన మోసాలు, ద్రోహాలు, జరుగుతున్న కుట్రల గురించి రాయగలగాలి, తేనె పూసిన కత్తుల వంటి ప్రచారాలను అడ్డుకునే చైతన్యాన్ని, జ్ఞానాన్ని కలిగించాలి. బీసీలు కాని ఇతర కవులు రాసిన బహుజన హిత సాహిత్యాన్ని చదవాలి. బీసీలు మన...

సహనుభూతి కథ

"సహానుభూతి వెలిగించిన దీపం" జ్వలిత-9989198943 గిప్పుడు గీ పొల్ల‌ను ఎవ‌రు చూడాలె తాదూర కంత లేదు మెడ‌కో డోల‌న్నట్టున్నది మ‌న పొల్ల‌గాల్ల‌నే హాస్టలేస్తిమి గా ప్ర‌వీణ్ కుమార్ సార్ పుణ్య‌మా మ‌న పోర‌ల్ల‌కు స‌ద‌వుకు ద‌క్కుతుంది. మ‌నం గీ చెప్పుల కొట్టు మీద బ‌తుకుడే ఎక్కువ‌. స‌ణుగుత‌నే ఉన్న‌ది సుగుణ‌. ఎవ‌రో క‌ష్ట‌మ‌రొచ్చిండు షూ పాలిష్ చెయ్య‌మ‌ని బ‌ండి టైం అయితాంద‌ని తొంద‌ర పెట్టుకుంట మూడు జ‌త‌ల బూట్లు ముందేసిండు. "స‌దువుడాపి గీ బూట్లు ఒక జోడి పాలిస్ పెట్టు నేను గూడ పెడ‌త జ‌ప్పునయిత‌ది లేదంటే తాత‌కు తిట్లు ప‌డ‌త‌యి" అన్న‌డు కాశ‌య్య‌. తానొక బూటు చేతిల‌కి తీసుకొని. "బాబ్బాబు చ‌చ్చి నీ క‌డుపున పుడ‌త త్వ‌ర‌గ చేసియ్యి ఇల్లంత పందిరేస్తున్న‌రు పిల్ల‌లు" అన్న‌డు బూట్లు తెచ్చిన ముస‌లాయ‌న‌. "ఆ, మా క‌డుపున పుట్టి ఏం బావుకుంట‌వ్, పెద్ద మ‌నిషి చెప్పులు కుడ‌త‌వా ఆక‌లికి మాడ‌త‌వా" ఇసురుకున్న‌ది సుగుణ‌. "అదేంట‌మ్మా మీ పిల్ల‌లు పోయిన‌ట్లు హాస్ట‌లుకు పోతా, బాగా చ‌దువుతా, మీ క‌ష్టాలు తీరుస్తా" ఆ...
బహిష్కరణ పిశాచాలు నన్ను బహిష్కరించాయ వేల సంవత్సరాల నాడు బహిష్టు పేరున మనువు పురుషులు బహిష్కరించారు న స్త్రీ స్వాతంత్రమర్హతే అని తండ్రులు అన్నలు తమ్ములు కూడా ఆడపిల్లవు ఆడిపిల్లవు అంటూ హక్కుల రెక్కలు కత్తిరించారు వ్యూహాల ఉయ్యాల మరిగి బహుజనుడొకడు వెలి వేశాడు నా ప్రశ్న వాడి అహానికి కొరివి పెట్టిందని బానిసకు బానిసొకడు బహిష్కరణ పాటందుకున్నడు నా అస్తిత్వ గళం విచ్చుకత్తై వాడి అజ్ఞానాన్ని చీల్చ బోతుందని రబ్బరు స్టాంపొకటి కొవ్వుముక్కలను పోగేసి నూనెపాఠాలకు దూరంగా నన్ను వెలి వేసానంది సామాజిక సమన్యాయం సొల్లుమాటలతొ అమాయకులను మాయ చేసే నల్ల కోటొకటి ఎడమ చేయి నరుకుతుంటె చేటు పాటు ఎరుగని కుడిచేయి చంకలు బాదుకుంటుంది యుగాలనాటి మానవత్వం చిటారుకొమ్మన అందని ద్రాక్షయ్యింది మనువాదం మారాకు తొడిగి అంబేద్కరును పూలేను వల్లె వేస్తున్నది అనాదిగా వెలి వేయబడ్డ నేను అక్షరాలను వెలిగించి అందకారానందాన్ని తగల బెడుతున్నాను నా వెంట ఆత్మవిశ్వాసపు అన్నలు ఆత్మాభిమానపు అక్కలు పూలు మొగ్గలు నా సైన్యం కాంతి విత్తులు ఎవరైనా ఎత్తుకోవచ్చు మళ్ళీ విత్తుకోవచ్చు వెలుతురు పంట అందరిదీ ప్రశ్నల ఆయుధాలతో హక్కుల యుద్దం ఎప్పడికీ ...
ప‌డిలేచిన క‌డ‌లి త‌రంగం - “అభిన‌వ మొల్ల” డా. చ‌క్ర‌వ‌ర్తుల ల‌క్ష్మీన‌ర్స‌మ్మ‌, భ‌ద్రాచ‌లం ఆమె జీవితం రాళ్ళ‌లో చిలికిన సెల‌యేరు. దానిని పావ‌న గోదావ‌రిగా మార్చుకుందామె. ఆమె ప‌డిలేచిన ఒక క‌డ‌లి త‌రంగం! రాముడు వెల‌సిన భ‌ద్రాచ‌లం రాజ‌వీధిలో ఆమె అక్ష‌ర రాణి సౌర‌భ‌ వాణి. బాధ‌ల‌ను ధిక్క‌రించిన వెలుగు ఆమె క‌విత్వం! ఆమె “అభిన‌వ మొల్ల‌” బిరుదాంకితురాలు డా. చ‌క్ర‌వ‌ర్తుల ల‌క్ష్మీనర‌స‌మ్మ‌. శ్రీ పొడిచేటి వీర రాఘ‌వాచార్యులు, శ్రీ‌మ‌తి న‌ర‌స‌మాంబ దంప‌తుల రెండ‌వ సంతానంగా 1939 జ‌న‌వ‌రి 3వ తేదీన ఆమె జ‌న్మించింది. తండ్రిగారు ఆగ‌మ‌శాస్త్ర పండితులు. భ‌ద్రాచ‌ల శ్రీ సీతారామచంద్ర‌స్వామి ఆల‌యంలో 60 సంవ‌త్సారాలు ప్ర‌ధానార్చ‌క ప‌ద‌విలో సేవ‌లందించిన మ‌హ‌నీయుడు. ఉదాత్త చ‌రితుడు. అజాత శ్ర‌తువు అంటారు అంద‌రు. ఆరుగురు సోద‌రీమ‌ణులు, న‌లుగురు సోద‌రుల‌కు ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు పంచి జీవితానుభ‌వాల నిఘంటువులో ప్రేమ అనే రెండ‌క్ష‌రాల‌కు అర్థం ఆమె. వారిది స‌నాత‌న కుటుంబం. 9 సంవ‌త్స‌రాల‌కే వివాహం జ‌రిపించారు. శార‌దా బిల్లు చ‌ట్టం ఉన్న ఆ స‌మ‌యంలో ఆమె వివాహం ర‌హ‌స్యంగానే జ‌రిగింది. అత్త‌, ఆడ‌ప‌డుచుల ఆర‌ళ్ళ‌తో అత్త‌వారింట...
THURSDAY, JANUARY 7, 2010 బాంబులు పేలుతున్నాయి తెలంగాణ బతుకులు బాంబులు POSTED BY జ్వలిత AT 1:34 AM 1 COMMENT: pelutunnayi POSTED BY జ్వలిత AT 12:15 AM NO COMMENTS: shoonyam దేహం దాహం శూన్యం శృంగారం POSTED BY జ్వలిత AT 12:15 AM 1 COMMENT: WEDNESDAY, DECEMBER 30, 2009 తరుణం ఎదిగి ఒదుగుతూ కరుగుతున్న తరుణం చిరు జల్లు కోరుకున్నా .. మంచువాన కురిపిస్తే తట్టుకోలేక వణుకుతున్నా వెచ్చని స్పర్శల చినుకు జీవితాన్ని యిస్తున్దనుకున్న శీతల శవ స్పర్స పాల రాతి సమాధి కట్టింది ఇప్పుడు నేనొక తాజమహల్ని నా చుట్టూ ప్రేమ సందర్శకులు ఎడతెగని అన్వేషణ నేను నీకు అనునిత్య స్వాగత తోరణం POSTED BY జ్వలిత AT 11:54 PM 1 COMMENT: TUESDAY, DECEMBER 29, 2009 ఆకాశం ఒక అవకాశం శూన్యాకాశం అనేకావసరాలు ఆకాశమంటే అవకాశమా..? POSTED BY జ్వలిత AT 8:38 PM NO COMMENTS: WEDNESDAY, DECEMBER 23, 2009 వేటాడే చేపలు చెరువు అమ్ముడుపోయింది చేపలు వేట వెతనేర్చుకోవాలి POSTED BY జ్వలిత AT 1:08 AM 1 COMMENT: TUESDAY, DECEMBER 22, 2009 కరువు చెట్టే పిందేలమ్ముకుంటుంది పండ్లకు కరువు POSTED BY జ్వలిత AT 12:16 AM NO COMMENTS: