పడిలేచిన కడలి తరంగం - “అభినవ మొల్ల” డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, భద్రాచలం ఆమె జీవితం రాళ్ళలో చిలికిన సెలయేరు. దానిని పావన గోదావరిగా మార్చుకుందామె. ఆమె పడిలేచిన ఒక కడలి తరంగం! రాముడు వెలసిన భద్రాచలం రాజవీధిలో ఆమె అక్షర రాణి సౌరభ వాణి. బాధలను ధిక్కరించిన వెలుగు ఆమె కవిత్వం! ఆమె “అభినవ మొల్ల” బిరుదాంకితురాలు డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ. శ్రీ పొడిచేటి వీర రాఘవాచార్యులు, శ్రీమతి నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా 1939 జనవరి 3వ తేదీన ఆమె జన్మించింది. తండ్రిగారు ఆగమశాస్త్ర పండితులు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 60 సంవత్సారాలు ప్రధానార్చక పదవిలో సేవలందించిన మహనీయుడు. ఉదాత్త చరితుడు. అజాత శ్రతువు అంటారు అందరు. ఆరుగురు సోదరీమణులు, నలుగురు సోదరులకు ప్రేమ, ఆప్యాయతలు పంచి జీవితానుభవాల నిఘంటువులో ప్రేమ అనే రెండక్షరాలకు అర్థం ఆమె. వారిది సనాతన కుటుంబం. 9 సంవత్సరాలకే వివాహం జరిపించారు. శారదా బిల్లు చట్టం ఉన్న ఆ సమయంలో ఆమె వివాహం రహస్యంగానే జరిగింది. అత్త, ఆడపడుచుల ఆరళ్ళతో అత్తవారింట...
ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు
శిశిరోన్ముఖం(కథ)
శిశిరోన్ముఖం జ్వలిత "ఒరే పవన్ మీ పెళ్ళెప్పుడురా…?" శీను. "ఏమో మామా నాకీజీవితంల పెళ్ళిరాతలేనట్టుంది. అనిత పెళ్ళొద్దంటున్నది" దిగులుగా అన్నడు పవన్. " అదేంటిరా.. ప్రేమించుకున్నమంటివి కదా.. పెళ్లి ఎందుకు వద్దట? విచిత్రాల పిల్లలురా మీరంతా.." విసుక్కున్నడు పవన్ మామ శీను. "విచిత్రం ఏమీ లేదు.. అనితకు పెళ్ళంటె ఇష్టం లేదు.." పౌరుషంగా జవాబిచ్చిండు మేనల్లుడు పవన్. "అంటే.. పెళ్ళి లేకుంట కలిసుంటరా? వాళ్ళోళ్ళు ఒప్పుకుంటరా? మీ అమ్మ నాయన ఊకుంటరా ? నన్ను ఇరికించకొరేయ్.." భయంగా అన్నడు శీను. "కలిసుంటె తప్పేంది ? కోర్టు కూడా 'సహజీవనం' న్యాయ సమ్మతమే అన్నదికదా ! అయినా అనిత కలిసి ఉండదు, పెండ్లి చేసుకోదు. ఇందుల నిన్ను ఇరికిచ్చుడేమి లేదులే.." నసిగిండు పవన్. "అబ్బ.. ఏందిరా నీ గోల? సరిగ చెప్పు" పంచర్ ఏస్తున్న సైకిల్ ట్యూబ్ నీళ్ళల్ల వదిలి వచ్చి, పవన్ పక్కన సిమెంట్ అరుగు మీద కూసున్నడు శీను. మళ్లీ తనే "పెళ్ళి చేసుకోరు, కలిసుండరు.. ఉత్తగనే ప్రేమ పచ్చులోతిగ జీవితమంతా.. షికార్లు తిరుగుతరా" చతురాడిండు . "నీకు పరాసికం అయితంది......
సమూహం పై సమీక్ష
బహుజన సమీకరణకు ‘సమూహం’ BY EDITOR · JUNE 7, 2017 రచన: జ్వలిత డెంచనాల కులాల గుట్టు రట్టు చేసే మార్గం అంతర్ వివాహాలు మాత్రమే అని చెప్పారు అంబేద్కర్. అస్తిత్వవాదం ఇప్పుడు మొదయింది కాదు. జ్యోతిరావుపూలే తన రచను బోధన ద్వారా చేసినది అదే. పుట్టుకతో అందరూ సమానులే అయినా చదువు లేని కారణంగా బానిసలుగా, పాపులుగా భావించబడు శూద్ర, అతిశూద్రు సమానమని వారు ఐక్యంగా కలిసినపుడు ద్రోహపూరిత వ్యూహాను తిప్పికొట్టగలుగుతామని, కులం కన్న, మతం కన్న మానవత్వం గొప్పదని, విద్య అందించిన జ్ఞానం వల్లనే మానవీయత సాధ్యమని చాటిన గొప్ప మార్గదర్శకుడు. మరి పూలే రచను, బోధను మరుగున పెట్టిన కుట్రలు ఇప్పుడు బీసి అస్తిత్వ వాదుల ఐక్యతను కూడా చీల్చుతాయి. స్త్రీ విద్య మహా పాపమని కొన్ని వంద వే సం॥ల స్త్రీని విద్యకు, స్వేచ్ఛకు దూరంగా ఉంచిన బ్రాహ్మణ భావజాలం ఇప్పటికి మన బహుజనులను ప్రభావితం చేస్తూనే ఉంది. బీసీ కవులు ఏమి రాయాలి జరిగిన మోసాలు, ద్రోహాలు, జరుగుతున్న కుట్రల గురించి రాయగలగాలి, తేనె పూసిన కత్తుల వంటి ప్రచారాలను అడ్డుకునే చైతన్యాన్ని, జ్ఞానాన్ని కలిగించాలి. బీసీలు కాని ఇతర కవులు రాసిన బహుజన హిత సాహిత్యాన్ని చదవాలి. బీసీలు మన...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి