పడిలేచిన కడలి తరంగం - “అభినవ మొల్ల” డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, భద్రాచలం ఆమె జీవితం రాళ్ళలో చిలికిన సెలయేరు. దానిని పావన గోదావరిగా మార్చుకుందామె. ఆమె పడిలేచిన ఒక కడలి తరంగం! రాముడు వెలసిన భద్రాచలం రాజవీధిలో ఆమె అక్షర రాణి సౌరభ వాణి. బాధలను ధిక్కరించిన వెలుగు ఆమె కవిత్వం! ఆమె “అభినవ మొల్ల” బిరుదాంకితురాలు డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ. శ్రీ పొడిచేటి వీర రాఘవాచార్యులు, శ్రీమతి నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా 1939 జనవరి 3వ తేదీన ఆమె జన్మించింది. తండ్రిగారు ఆగమశాస్త్ర పండితులు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 60 సంవత్సారాలు ప్రధానార్చక పదవిలో సేవలందించిన మహనీయుడు. ఉదాత్త చరితుడు. అజాత శ్రతువు అంటారు అందరు. ఆరుగురు సోదరీమణులు, నలుగురు సోదరులకు ప్రేమ, ఆప్యాయతలు పంచి జీవితానుభవాల నిఘంటువులో ప్రేమ అనే రెండక్షరాలకు అర్థం ఆమె. వారిది సనాతన కుటుంబం. 9 సంవత్సరాలకే వివాహం జరిపించారు. శారదా బిల్లు చట్టం ఉన్న ఆ సమయంలో ఆమె వివాహం రహస్యంగానే జరిగింది. అత్త, ఆడపడుచుల ఆరళ్ళతో అత్తవారింట...
ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు
"మూలమలుపు" సమీక్ష
'మూలమలుపు'లో బతుకు చిత్రాల కవిత్వం. సాహితీలోకంలో ఏనుగు నరసింహా రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి కాక ముందు నుండే ఒక కవిగా సుపరిచితులే. చిన్న పత్రిక నుండి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల వరకు , అన్ని పత్రికల్లోనూ వారి కవిత్వానికి ఎందరో పాఠకులు ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రచనా వ్యాసంగంలో అనేక ప్రక్రియల్లో వారు రచనలు చేస్తున్నారు. ఆంధ్రప్రభలో 2016 నుండి అప్రతిహతంగా ప్రతి వారం రాసే రూబాయిలు వారి సాహితీ వ్యవసాయానికి నిదర్శనం. "పుస్తకాలు లేని ఇల్లు ఎడారి" అని చెప్పే ఈ కవి , తనను కలిసిన అందరికీ పుస్తకాలను జ్ఞాపికలుగా అందిస్తూ అక్షర సేద్యానికి విత్తనాలను పంచుతారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూసీతీరంలోని కల్లోనికుంటలో జన్మించి, నల్గొండ జిల్లా చిట్యాలలో పెరిగిన వీరి ప్రతి అక్షరంలోతెలంగాణ భాషాసౌందర్యం తొణికిసలాడుతుంది. "అంతరంగం" అనే వీరి ఆధునిక కవిత్వ విమర్శ గ్రంథంలో ఇరవై ఆరు వ్యాసాలున్నాయి. వారి సునిశిత పరిశీలన , సున్నితమైన విమర్శకు అద్దంపడుతుంది ఈ "అంతరంగం"అనే పుస్తకం. ఈ...
శిశిరోన్ముఖం(కథ)
శిశిరోన్ముఖం జ్వలిత "ఒరే పవన్ మీ పెళ్ళెప్పుడురా…?" శీను. "ఏమో మామా నాకీజీవితంల పెళ్ళిరాతలేనట్టుంది. అనిత పెళ్ళొద్దంటున్నది" దిగులుగా అన్నడు పవన్. " అదేంటిరా.. ప్రేమించుకున్నమంటివి కదా.. పెళ్లి ఎందుకు వద్దట? విచిత్రాల పిల్లలురా మీరంతా.." విసుక్కున్నడు పవన్ మామ శీను. "విచిత్రం ఏమీ లేదు.. అనితకు పెళ్ళంటె ఇష్టం లేదు.." పౌరుషంగా జవాబిచ్చిండు మేనల్లుడు పవన్. "అంటే.. పెళ్ళి లేకుంట కలిసుంటరా? వాళ్ళోళ్ళు ఒప్పుకుంటరా? మీ అమ్మ నాయన ఊకుంటరా ? నన్ను ఇరికించకొరేయ్.." భయంగా అన్నడు శీను. "కలిసుంటె తప్పేంది ? కోర్టు కూడా 'సహజీవనం' న్యాయ సమ్మతమే అన్నదికదా ! అయినా అనిత కలిసి ఉండదు, పెండ్లి చేసుకోదు. ఇందుల నిన్ను ఇరికిచ్చుడేమి లేదులే.." నసిగిండు పవన్. "అబ్బ.. ఏందిరా నీ గోల? సరిగ చెప్పు" పంచర్ ఏస్తున్న సైకిల్ ట్యూబ్ నీళ్ళల్ల వదిలి వచ్చి, పవన్ పక్కన సిమెంట్ అరుగు మీద కూసున్నడు శీను. మళ్లీ తనే "పెళ్ళి చేసుకోరు, కలిసుండరు.. ఉత్తగనే ప్రేమ పచ్చులోతిగ జీవితమంతా.. షికార్లు తిరుగుతరా" చతురాడిండు . "నీకు పరాసికం అయితంది......
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి