అమ్మ ఓడిపోయింది
టీచర్ వాడు చచ్చి పోయాడు"ఆనందంగా చెప్పింది సంతోషి. "వారం రోజులు బడికి రాలేదు ఎందుకు అంటే .. ఎవరో చచ్చిఫోయారంటవేం" మందలించింది టీచర్. "అవును టీచర్, నేను పుట్టినందుకు మా అమ్మను కొట్టి.. అమ్మను వదిలేస్తానని. నన్ను అక్కను చంపుతానన్నవాడు. తాత వాడి కాళ్ళు పట్టుకొని బతిమిలాడితే అక్కను మాత్రమే సాదడానికి ఒప్పుకున్నవాడు .. ఇన్నేళ్ళు నాకు అమ్మను దూరం చేసినవాడు చచ్చాడు టీచర్"ఉద్వేగంగా చెప్పింది సంతోషి. జలధి టీచర్ ఆ పసిదాని పరిస్థితి కొంత అర్థం చేసుకుంది. "సరె సరె నువ్వెందుకు ఎళ్ళావ్ వాడు చస్తె, వాడంటె నీకసహ్యం కదా" టీచర్ అడిగింది. "అదె టీచర్ వాడు చస్తె చూడ్డానికి కూడా రానన్నదట మా అక్క . అంతగా హింసపెట్టాడు అక్కను వాడు.ఏదొ స్నేహగృహం అని బాధిత మహిళల కోసం పనిచేస్తుందట అక్కడ తలదాచుకుంటున్నది. మా తాత పట్టుపట్టి తీసుకు పొయ్యాడు . నేనే తలకొరివి పెట్టి వచ్చావాడికి" గాలి పీల్చుకుంది ఆఅమ్మాయి. పిల్ల వెంటే తోడుగా వచ్చి బయటె నిల్చున్న నరసయ్య ఆ మాటలన్ని వింటున్నడు. మరి మీ అమ్మ మీతొ వచ్చిందా.?అడగింది టీచర్. "రాలేదు. ఐదు సంవత్సరాలు కాంట్రాక్టుకు మా అమ్మను ...