https://www.blogger.com/profile/07006581019370914774
పడిలేచిన కడలి తరంగం - “అభినవ మొల్ల” డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, భద్రాచలం ఆమె జీవితం రాళ్ళలో చిలికిన సెలయేరు. దానిని పావన గోదావరిగా మార్చుకుందామె. ఆమె పడిలేచిన ఒక కడలి తరంగం! రాముడు వెలసిన భద్రాచలం రాజవీధిలో ఆమె అక్షర రాణి సౌరభ వాణి. బాధలను ధిక్కరించిన వెలుగు ఆమె కవిత్వం! ఆమె “అభినవ మొల్ల” బిరుదాంకితురాలు డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ. శ్రీ పొడిచేటి వీర రాఘవాచార్యులు, శ్రీమతి నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా 1939 జనవరి 3వ తేదీన ఆమె జన్మించింది. తండ్రిగారు ఆగమశాస్త్ర పండితులు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 60 సంవత్సారాలు ప్రధానార్చక పదవిలో సేవలందించిన మహనీయుడు. ఉదాత్త చరితుడు. అజాత శ్రతువు అంటారు అందరు. ఆరుగురు సోదరీమణులు, నలుగురు సోదరులకు ప్రేమ, ఆప్యాయతలు పంచి జీవితానుభవాల నిఘంటువులో ప్రేమ అనే రెండక్షరాలకు అర్థం ఆమె. వారిది సనాతన కుటుంబం. 9 సంవత్సరాలకే వివాహం జరిపించారు. శారదా బిల్లు చట్టం ఉన్న ఆ సమయంలో ఆమె వివాహం రహస్యంగానే జరిగింది. అత్త, ఆడపడుచుల ఆరళ్ళతో అత్తవారింట...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి