'మూలమలుపు'లో బతుకు చిత్రాల కవిత్వం. సాహితీలోకంలో ఏనుగు నరసింహా రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి కాక ముందు నుండే ఒక కవిగా సుపరిచితులే. చిన్న పత్రిక నుండి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల వరకు , అన్ని పత్రికల్లోనూ వారి కవిత్వానికి ఎందరో పాఠకులు ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రచనా వ్యాసంగంలో అనేక ప్రక్రియల్లో వారు రచనలు చేస్తున్నారు. ఆంధ్రప్రభలో 2016 నుండి అప్రతిహతంగా ప్రతి వారం రాసే రూబాయిలు వారి సాహితీ వ్యవసాయానికి నిదర్శనం. "పుస్తకాలు లేని ఇల్లు ఎడారి" అని చెప్పే ఈ కవి , తనను కలిసిన అందరికీ పుస్తకాలను జ్ఞాపికలుగా అందిస్తూ అక్షర సేద్యానికి విత్తనాలను పంచుతారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూసీతీరంలోని కల్లోనికుంటలో జన్మించి, నల్గొండ జిల్లా చిట్యాలలో పెరిగిన వీరి ప్రతి అక్షరంలోతెలంగాణ భాషాసౌందర్యం తొణికిసలాడుతుంది. "అంతరంగం" అనే వీరి ఆధునిక కవిత్వ విమర్శ గ్రంథంలో ఇరవై ఆరు వ్యాసాలున్నాయి. వారి సునిశిత పరిశీలన , సున్నితమైన విమర్శకు అద్దంపడుతుంది ఈ "అంతరంగం"అనే పుస్తకం. ఈ...
పడిలేచిన కడలి తరంగం - “అభినవ మొల్ల” డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, భద్రాచలం ఆమె జీవితం రాళ్ళలో చిలికిన సెలయేరు. దానిని పావన గోదావరిగా మార్చుకుందామె. ఆమె పడిలేచిన ఒక కడలి తరంగం! రాముడు వెలసిన భద్రాచలం రాజవీధిలో ఆమె అక్షర రాణి సౌరభ వాణి. బాధలను ధిక్కరించిన వెలుగు ఆమె కవిత్వం! ఆమె “అభినవ మొల్ల” బిరుదాంకితురాలు డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ. శ్రీ పొడిచేటి వీర రాఘవాచార్యులు, శ్రీమతి నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా 1939 జనవరి 3వ తేదీన ఆమె జన్మించింది. తండ్రిగారు ఆగమశాస్త్ర పండితులు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 60 సంవత్సారాలు ప్రధానార్చక పదవిలో సేవలందించిన మహనీయుడు. ఉదాత్త చరితుడు. అజాత శ్రతువు అంటారు అందరు. ఆరుగురు సోదరీమణులు, నలుగురు సోదరులకు ప్రేమ, ఆప్యాయతలు పంచి జీవితానుభవాల నిఘంటువులో ప్రేమ అనే రెండక్షరాలకు అర్థం ఆమె. వారిది సనాతన కుటుంబం. 9 సంవత్సరాలకే వివాహం జరిపించారు. శారదా బిల్లు చట్టం ఉన్న ఆ సమయంలో ఆమె వివాహం రహస్యంగానే జరిగింది. అత్త, ఆడపడుచుల ఆరళ్ళతో అత్తవారింట...
పూనాచ్చి 2 పెరుమాళ్ మురుగన్ ఆత్తూర్ తమిళంలో రచించిన "పూనాచ్చి " తమిళ నవలకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం 'పూనాచ్చి' ఒక మేక పిల్ల కథ. 2014లో "మాధొరు భాగన్" తమిళ నవలకు ఆంగ్లానువాదం 'వన్ పార్ట్ విమన్'కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. దాని తెలుగు అనువాదమే 'అర్థనారీశ్' . అవార్డు ప్రకటన తర్వాత తమిళనాడులో వివాదాలు మొదలయ్యాయి. పెరుమాల్ మురుగన్ పై కేసులు పెట్టి, అరెస్టు చేయాలని, పుస్తకాన్ని నిషేధించాలని కొన్ని సమూహాలు ప్రయత్నించాయి. మద్రాస్ హైకోర్టు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా, భావప్రకటనా స్వేచ్ఛను గుర్తు చేస్తూ, పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీం కోర్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరు తమ భావాలను వ్యక్తపరచవచ్చని. "పెరుమాళ్ మురుగన్ రచన నచ్చకపోతే కొనకండి , చదవకండి, కానీ ఎవరి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించకండి" అని చెప్పడంతో వివాదం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పుతో "వివాదాలు దాడులతో రచనా వ్యాసంగాన్ని వదిలేస్తున్నాను" అని ప్రకటించిన మురుగన్ తో పాటు అనేకమంది కవులకు రచయితలుకు ధైర్యం ...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి