మనమే చేయాలి

 https://m.facebook.com/story.php?story_fbid=2299332806776210&id=100000985399037


అమ్మలు నాన్నలూ.. పిల్లలు జాగ్రత్తా


ఎండాకాలం వచ్చేస్తోంది అమ్మానాన్నలు పిల్లలు జాగ్రత్త. ఎండదెబ్బ తగులుద్దని జాగ్రత్త చెప్పట్లే. భార్యాభర్తలు ఇద్దరూ పనులకు వెళ్ళే వాళ్ళు మీ పిల్లలు జాగ్రత్త. రెండు నెలల్లో 42అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. అన్నీ మైనర్ పిల్లల పైనే.

రెండున్నరేళ్ళ మనవరాలి పై తాత. తొమ్మిదేళ్ళ , నాలుగేళ్ళ బిడ్డల పై తండ్రులు, ఇట్లా .....

నిన్న ఆరేళ్ళ పిల్లపై గొంతులో ఇనుప చువ్వ కుచ్చి మరీ అత్యాచారం. 

అమ్మానాన్నలు జాగ్రత్త అడవి కంటే భయంకరమైన సమాజంలో ఉన్నాం మన పిల్లలకు మనమే ప్రథమ రక్ష.

ఘోరాలు జరిగినంక ఎంత రోదించినా , నేరస్తులకు ఏ శిక్షలు వేసినా మన పిల్లలు మనకు బాధాతప్త స్మృతులే , గుండెలు పగిలే జ్ఞాపకాలే. 


ఇప్పుడు నేను రాసే సుద్దులేవీ స్లమ్ వీథుల్లో పొట్టపట్టుకుని కూలీచేసే వాళ్ళు చదవరు. పసిపిల్లల పై అత్యాచారాలు జరిగేది ఇటువంటి ప్రాంతాల పిల్లల పైనే.

సింగిల్ పేరెంట్స్ పిల్లలు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేసే పిల్లలే కామాంథులకు టార్గెట్లు.

మరి బుద్దిజీవులు మానవతా మూర్తులు ఏమి చేయాలి మిద్దెతోట అవగాహనా సదస్సులు చేసినట్టే తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి.


పిల్లలకు ఈ విషయాలు

1) కొత్తవాళ్ళు ఎవరు ఏదిచ్చినా తీసుకోవద్దు. తీసుకోకుండా పక్కనున్న పరిచయస్తులకు ఇళ్ళవాళ్ళకు , తల్లిదండ్రులకు (వచ్చిన తరువాత) చెప్పాలి. గట్టిగా అరవాలి. అక్కడినుంచి పరిగెత్తాలి.


2) కొత్తవాళ్ళు పలకరించినా దగ్గరికి పిలిచినా వెళ్ళవద్దు. సమాధానం చెప్పొద్దు. గట్టిగా అరవాలి.


3) పరిచయస్తులైనా ఒంటరిగా పిలిచినా రహస్య మరుగు ప్రదేశాలకు పిలిచినా గదుల్లోకి పిలిచినా వెళ్ళవద్దు. వెంటనే ఎవరికైనా చెప్పాలి. గట్టిగా అరవాలి. పరిగెత్తాలి.


4) ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలలో ఆడుకోవద్దు. నలుగురు మెసిలే ప్రదేశాల్లో ఆడుకోవాలి. 


5) తోటి పిల్లలు ఆటలంటూ పిలిచినా దూరంగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళద్దు.


6) పెద్దపిల్లలు చిన్నపిల్లలను తమ్ముళ్లు చెల్లెళ్ళను అంటిపెట్టుకుని కనిపెడుతూ ఉండాలి.


7) మగ ఆడ పిల్లలు ఒకరి పట్ల ఒకరు దయ జాలి ప్రేమ గౌరవం కలిగి ఉండాలి. సరదాకు ఆటల్లో భాగంగా కూడా కొట్టుకోవద్దు బాధపెట్టుకోకూడదు.


8) చెడు స్పర్శ కు మంచి స్పర్శ కు తేడా గుర్తుపట్టాలి.


తల్లిదండ్రులకు ఈ వీషయాలు

1) పిల్లల పట్ల బాధ్యతగా, ప్రేమగా ఉండాలి. ఇతర కారణలేవైనా వారిని కొట్టొద్దు. అవమానించొద్దు, హింసించొద్దు.


2)పైన తెలిపిన అంశాలను ప్రతిరోజు పనికి వెళ్ళేముందు పిల్లకు గుర్తుచేసి జాగ్రత్తలు చెప్పాలి.


3) పని నుండి వచ్చిన తరువాత ఆ రోజు జరిగిన విషయాలను అడిగి తెలుసుకోవాలి.


4) పిల్లలను ఏ విషయంలోను భయపెట్టద్దు , అబద్దాల అపోహలు కలిగించొద్దు. అనవసర ఆశలు కల్పించొద్దు. చుట్టూ జరుగుతున్న సంఘటనలను పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పాలి. జాగ్రత్తగా తెలివిగా ఉండాలని చెప్పాలి.


5) స్మార్ట్ ఫోన్లు అనవసరమైన విషయాలను, వీడియోలను అందిస్తాయి. పిల్లలకవి అందుబాటులో ఉంచొద్దు.


6) పిల్లలు మనను గమనిస్తారు అనుకరిస్తారు అన్నీ అర్థం చేసుకుంటారు. వారిని కొడతా చంపుతా నరుకుతా తోలుతీస్తా వంటి భయానక పదాలను, బూతులను మాట్లాడకూడదు. భయపడితే మీతో అన్నీ చెప్పలేరు అది ప్రమాదం. మీరు స్నేహంగా ఉంటే మీతో అన్నీ పంచుకుంటారు. మీ ప్రేమ వారికి ధైర్యాన్నిస్తుంది.


7) పిల్లల ముందు మధ్యం పొగతాగకూడదు.(ఈ పాటికె మీకలవాటయిన వాటిని తగ్గించుకోవాలి , కొత్తయి మానుకోవాలి) ఇంట్లో గొడవలు లేకుండా పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. మీరు పడుతున్న శ్రమకష్టం , కుటుంబ వాస్తవ పరిస్థితులు పిల్లలకు అర్థమయ్యేట్టు వివరించాలి. కష్టం తెలియకుండా పెరుగుతే బాధ్యత లేకుండా తయారవుతారు.


8) పిల్లలను పనుల్లో భాగస్వామ్యులను చెయ్యాలి. (మనం కూచ్చొని వాళ్ళతో చేయించడం కాదు) మనతనం అలవాటయతది. 


9) 100, 108, 1098 వంటి ఫోన్ నంబర్లు హెల్ప్ లైన్ల సమాచారం వినియోగం వివరించాలి.


10) అంతా చెడు లేదు అట్లా అని అంతా మంచి లేదు సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పాలి.

11) పిల్లల ఏడ్పులు అరుపులు వినపడినప్పుడు , పిల్లలను వేధిస్తున్నట్టు , ఏదైనా ఆశ చూపి లేదా బలవంతంగా తీసుకు పోతున్నట్టు కనిపిస్తే అందరూ స్పందించాలి. సహాయం చెయ్యాలి. పోలీసులకు సమాచారం ఇవ్వాలి.


*పై విషయాలు వ్యక్తులుగా సమూహాలుగా శాఖలుగా ప్రచారంలోకి తేవాలి. అందరూ కలిసి విడివిడిగా విస్తృతంగా చెయ్యాలిసినవి. NGOs, బాలలహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థిసంఘాలు.

పోలీసు శాఖ, స్త్రీ శిశుసంక్షేమశాఖల సమన్వయంతో తక్షణం యుద్దప్రాతిపదికన బుద్దిజీవులంతా అత్యవసరంగా ఉద్యమంలా చెయ్యాలి.


*నేరాలు జరిగే వాతావరణం లేకుండా చేయడం, *నేరాలకు అవకాశాలను తగ్గించడం.

*నేర ప్రవృత్తులను గుర్తించి అరికట్టడం.


*కొత్తగా వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారిని గుర్తించి జాగ్రత్త పడడం ద్వారా. మనపిల్లలు పిల్లలందరూ మనవాళ్ళే రేపటీ తల్లులు తండ్రులు.

*రేపటి తరాన్ని , పచ్చటి పంటల్ని. కలుపులేని రసాయనాలు వాడని ఆహారపదార్థాల వంటి మానవ సమాజాన్ని తయారు చేయడంలో మనం 

భాగస్వామ్యులం కావాలి. 

*మనిషైన ప్రతొక్కరి బాధ్యత ఇది. 

*లేదంటే ఒక్కమాట మాట్లాడే హక్కు మనకు లేదు.

జ్వలిత 9989198943

23032019930

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

"మూలమలుపు" సమీక్ష

శిశిరోన్ముఖం(కథ)