ఆయుధం కాదు ఔషధం
వలసల చేతిలో ఔషధం(శీర్షిక)
రచన-జ్వలిత-9989198943బతుకుదారితోపాటు
ఆశలకనుగుడ్డు సొన కారిపోయింది
మనిషి నేలను నడకతో కొలుస్తూన్నాడు
నెత్తురోడే బచ్చేదాన్లున్న బాలింతలకే కాదు
అరికాళ్ళకు నెత్తుటి సంచులు మొలుస్తున్నాయి
చెమటతో తడిసిన జీవితం
కన్నీటి చారలతో అట్టలు కట్టిందిఏ
పాలమరకలు పెదవికి చేరట్లేదు
నీటిచుక్కలు గొంతు తడపట్లేదు
మద్యం మహానదిలా పారుతూ
మూత్రపుతిత్తులు చిల్లులుపడుతున్నాయి
ఉమ్మనీటి సంచులు నెత్తుటిమడుగులౌతున్నాయి
కడుపు చేతబట్టి దేశం పట్టిన మనిషి
గూడు చెదిరిన పక్షయి గుండె చెదిరాడు
ప్రాజెక్టు నీళ్ళతో నేలలు తడిచినా
బతుకు మీద నమ్మకం దొరకట్లేదు
కొత్తగా చెరువులకు గండ్లు పడి
బతుకులు మునుగుతనే ఉన్నయి
పట్టీపట్టని బాధ్యత ఉండీలేని బోడిగుండయింది
ఉరిమిన ఊరువు, ఉబికిన రవికె
చెదిరిన ధైర్యం, బెదిరిన గుండె
కాలు కలిపి కదలిన రాదారయ్యింది
పాతదే స్వార్ధం కొత్త కరోనాతో కలిసి
ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతోంది
పాజిటివ్ వచ్చిన వాళ్ళే కాదు మనమంతా
భయం పంజరంలో పిట్టలమే
హంస ఎగిరిపోకుండా మిగిలి ఉంటే
ఓటు ఆయుధం కాదు ఔషధమని వైద్యం చేద్దాం
.. ... .... ..... .... ... ..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి