పోస్ట్‌లు

https://www.blogger.com/profile/07006581019370914774

పాలు సున్నపు నీళ్ళు

పాలు- సున్నపు నీళ్ళు/జ్వలిత ఇక్కడ చెంచాల సమ్మేళనం సాగుతూన్నది కొన్నిపాత్రల కనుసైగలతో సదస్సు మొదలైంది కారంకుండను చూచి మంటలనుకొని అంటించని పొయ్యి చుట్టూ గంటెలు సాగిలపడుతున్నాయి గాజులులేని చేతివంట రుచుండదని సన్నాసిశిబ్బి సన్నాయి ఊదుతూన్నది వండనివీ వండినవీ వంతులేసుకొని మింగుతున్న చీమలు కవాతు చేస్తున్నయి ఆరగింపులకు ఆటంకమని పిల్లులు ఎలుకలను బందిస్తున్నయి ప్రేమైక వస్తుసౌందర్య నగ్నబొద్దింక ముగ్దరమణీయ ప్రదర్శన రాతికుప్పల మీద చూపుల బూతులకు మాంసపు ముద్దలమీద వాతలేసుకుంటున్నయి మెదళ్ళు ఇంకా చెంచాల సమ్మేళనం నడుస్తూన్నది మసిగుడ్డలన్నా కప్పండని గంగాళం గొంతు చించుకుంటున్నది ఈగలు దోమలు పిలుపులందుకొని పీలికలు సర్దుకొని బాకాలూదుతున్నవి ఆశల జాలాట్లో దొర్లుతున్న పందులు ఉలికిపడి ఉరుకుతున్నయి ఉడకని అన్నానికి తల్లెలు పట్టిన ఆకలిని పక్కసందులకు గుంజుతున్నయి పందికొక్కులు ఎముకలు కొరికే దరిద్రం వెన్నెల్లో ఆడపిల్లయి తోడేళ్ళగోళ్ళకు రంగేస్తూన్నది చెంచాల సదస్సు లొల్లాయి పదాలను చిలకరిస్తూన్నది అజీర్తి వాయువు ముక్కులను శుభ్రం చేస్తూంటే వెలగని పొయ్యికి హారతిస్తూన్నది కల్యమాకు ఎంగిలే కాని గి...

నమ్మడమంటే సిద్దపడటమే

నమ్మడమంటే సిద్దపడటమే/జ్వలిత నేను ఏదో చెప్పేలోపే నువు నిర్ణయించుకుంటావు నేను సిద్దపడుతుండగా నువు ప్రారంభింస్తావు నేను ఫలితాల అంచనాలు చూస్తుండగా నువు ఓటమితో తిరిగొస్తావు అనివార్య మలుపుల దగ్గర జాగరూకత పాటిస్తూంటే అనవసర ముసుగులతో నిలబడతావు అసలు మనిద్దరిది ఒకే మార్గమయినపుడు ఉన్నట్టుండి బరువైపోతావు ఎందుకు నమ్మకమే లేని సఖ్యతై  నీ చెవి సకల మురుగును స్రవిస్తూంటుందేమిటి నువు మాత్రం పసిపాపవై నవ్వుతూ మాట్లాడుతుంటావు నీ చేతిలో అస్తవ్యస్త ఆయుధాలు రక్తమోడుతుంటాయి నీ వెనుకనుండి కమలాలు విరగబడి నవ్వుతూంటాయి స్వార్థ జ్వాలల నడుమ చండాలిక శిరసును ఖండించిన  ఖడ్గం యూపధారువై దర్శనమిస్తూ కాలకూట గరళ పాచికలను విసురుతున్నది కదా నమ్మడమంటే బలికి సిద్దపడటమే నిత్యం చచ్చే జీవితాలకు సంతాపంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిరంతరం కొనసాగతూంటది అది నువ్వో నేనో ఎవరైనా కరిగేది మాత్రం మనమే ......... 31-10-2017(10.20pm)

అమ్మ ఓడిపోయింది

టీచర్  వాడు చచ్చి పోయాడు"ఆనందంగా చెప్పింది సంతోషి. "వారం రోజులు బడికి రాలేదు ఎందుకు అంటే .. ఎవరో చచ్చిఫోయారంటవేం" మందలించింది టీచర్. "అవును టీచర్, నేను పుట్టినందుకు మా అమ్మను కొట్టి.. అమ్మను వదిలేస్తానని. నన్ను అక్కను చంపుతానన్నవాడు. తాత వాడి కాళ్ళు పట్టుకొని బతిమిలాడితే అక్కను మాత్రమే సాదడానికి  ఒప్పుకున్నవాడు .. ఇన్నేళ్ళు నాకు అమ్మను దూరం చేసినవాడు చచ్చాడు టీచర్"ఉద్వేగంగా  చెప్పింది సంతోషి. జలధి టీచర్ ఆ పసిదాని పరిస్థితి కొంత అర్థం చేసుకుంది. "సరె సరె నువ్వెందుకు ఎళ్ళావ్ వాడు చస్తె, వాడంటె నీకసహ్యం కదా" టీచర్ అడిగింది. "అదె టీచర్ వాడు చస్తె చూడ్డానికి  కూడా రానన్నదట మా అక్క . అంతగా హింసపెట్టాడు అక్కను వాడు.ఏదొ స్నేహగృహం అని బాధిత మహిళల కోసం పనిచేస్తుందట అక్కడ తలదాచుకుంటున్నది. మా తాత పట్టుపట్టి తీసుకు పొయ్యాడు . నేనే తలకొరివి పెట్టి వచ్చావాడికి" గాలి పీల్చుకుంది ఆఅమ్మాయి. పిల్ల వెంటే తోడుగా వచ్చి బయటె నిల్చున్న నరసయ్య ఆ మాటలన్ని వింటున్నడు. మరి మీ అమ్మ మీతొ వచ్చిందా.?అడగింది టీచర్. "రాలేదు. ఐదు సంవత్సరాలు కాంట్రాక్టుకు మా అమ్మను ...

ఆమెలకు భయపడిన సన్నాసులు

ఆమెలకు భయపడుతున్న సన్నాసులు-జ్వలిత ప్రపంచమే పరివారమైన వారిని సత్తుగింజల గుంపులో సత్యమున్న మనుషుల్ని ఒక్కొక్కరినీ వెంటాడి వేటాడే ఆటనడుస్తున్నది సంతులు సన్నాసులంతా కలిసి ఆయుధాలతో వేదాలు పలుకుతుంటే ఆమెలెవరైనా ప్రశ్నలను ధరిస్తే హత్యలకు అత్యాచారాలకు ఫలహారాలే యాగాలు చేస్తూ చంపేస్తారు మంత్రాలు చదువుతూ చంపేస్తారు యంత్రాలు గా మారి చంపేస్తారు అక్కడ పోరాటాలు చేసినవారు రంగులు మార్చి వేలసమూహాలను రక్తసముద్రాలు చేస్తే ఇక్కడ అక్షర వీరులను సంతులు చంపుతున్నారు చంపడమన్నది ప్రపంచాన్నేలుతున్న సరికొత్త క్రీడ హత్యారాజకీయాల సుఖరోగాల సన్నాసుల్లారా కలం పట్టి నిలబడ్డ ఆమెను చూస్తే భయమేసిందా అవును అక్షరాల ఆమే గెలిచింది ఆమెను చంపిన మీ పిరికితనం ఓడింది దేశమంటే సన్నాసులు కాదురా సన్నాసీ దేశమంటే ఆమెతనాన్ని మరిచిన మనుషులున్న నేల కదా ఎవరూ ఆమెలకు భయపడకండీ +++-------+++ (హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీలంకేష్ కు అక్షరనివాళి) ది.6/8/2017.11.30

పాము

పాము సరే విషం కక్కింది మనిషివి కదా మరినువ్వేమి చేశావు గుండె మార్పిడి చేయించా వేప సరే చేదు నువ్వేం చేశావు తేనె కలిపి చప్పరించా ఔషధం అయ్యింది

చూపులు

చాలా కష్టం చూపులు తట్టుకోవడం గడ్డం ఆన్చి కూర్చొమని కళ్ళల్లో కళ్ళు పెట్టి గుచ్చుకువే  కాంతి చూపులు తట్టుకోవడం మరీ కష్టం కళ్ళు మూసుకొని ఎదురు చూస్తూండడం మరీ కష్టం           ఓ ఊహించుకోకండి... (కళ్ళల్లో చుక్కల మందేసి కళ్ళు మూసుకొని కూర్చోమన్నపుడు)