ఇప్పటికీ కొనసాగుతున్న విషాధకామరూప
ఇంకా కొనసాగుతూన్న 'విషాద కామరూప'-2 సమీక్షకులు- జ్వలిత.9989198943 "విషాద కామరూప" నవల అస్సాం రాష్ట్రంలోని, కామరూప జిల్లాలోని, ఒక మారుమూల 'సత్త్ర' అని పిలువబడే వైష్ణవ మఠాల చుట్టూ ఉన్న చిన్న గ్రామం. ఆనాటి సత్రాల దయనీయ స్తితితో పాటు, అస్సాం సంస్కృతిలోని ప్రతి సూక్ష్మ అంశాన్ని 'కామరూప' అనే మాండలికంలో ఇందిరా గోస్వామి "ఊనే ఖోవా హౌదా" అనే అద్భుతమైన నవలగా రాసారు. కామరూప మాండలిక భాష చాలా తక్కువ మందికి వచ్చు కాబట్టి. దానిని తిరిగి ఇంగ్లీషులోకి "ఏ సాగా ఆఫ్ సౌత్ కామరూప" అనే పేరుతో అనువాదం చేయవలసి వచ్చిందని రచయిత్రి తన ముందు మాటలో చెప్పుకున్నారు. దానికి తెలుగు అనువాదం చేసినవారు గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. 'కేంద్ర సాహిత్య అకాడమీ' 2002వ సంవత్సరంలో మొదటిసారి ఈ నవలను ప్రచురించింది . 19వ శతాబ్దం ప్రథమ భాగంలో 1820 మొదలు బ్రిటిష్ పాలన అంతరించి భారతదేశం స్వాతంత్రం పొందేదాకా సుమారు 125 ఏళ్ల పాటు ఈ నవల ఇతివృత్తకాలం. అస్సాంలోని ప్రసిద్ధ వంశమైన ఒక గోసాయి కుటుంబంలో జరిగిన విషాద గాధ ఈ నవలకు ఇతివృత్తం. గోసాయిలు లేదా గోస్వామీలు...