ఆదివాసి శతక సమీక్ష
పుస్తక సమీక్ష "ఆదివాసి రాసిన ఆదివాసీ శతకం" శతకం అంటే మనకు భక్తి శతకాలు, నీతి శతకాలు, కొండొకచో శృంగార శతకాలు గుర్తుకు వస్తాయి. కానీ, అస్తిత్వ శతకాలు అసలు లేవు అనవచ్చు. కోసు ప్రసాదరావు తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం మండలం, బందపల్లి ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు. "ఆదివాసీల" మీద శతకం రాసిన వాళ్ళలో మొదటివారై ఉంటారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు మొత్తం నాలుగు శతకాలు రచించారు. అవి (1) మాతృశ్రీ గండి పోశమ్మ శతకం, (2) శ్రీ షిర్డి సాయి శతకం (3) శ్రీ రంప మల్లిఖార్జున శతకం, (4) ఆదివాసి శతకం, ఇంతకుముందు రాసిన మూడు ఆధ్యాత్మిక శతకాలు అయితే జన్మతః ఆదివాసి అయినవారు "ఆదివాసీల శతకం" రాయడం అభినందనీయం. దీనిని వారి తల్లి దండ్రులకు అంకితమిచ్చారు. ఆదివాసీల స్థితిగతుల గురించిన సామాజిక అంశం పై రాసిన శతకం ఇది. ఇందులో మొత్తం 108 పద్యాలున్నాయి. "మకుటం పల్లెవాసి మాట పసిడి మాట" శతకం ప్రారంభానికి ముందు అల్లూరి సీతారామరాజుకు నివాళి అర్పించారు. ముందు మాటలు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, బందప...