పోస్ట్‌లు

అక్టోబర్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

నమ్మడమంటే సిద్దపడటమే

నమ్మడమంటే సిద్దపడటమే/జ్వలిత నేను ఏదో చెప్పేలోపే నువు నిర్ణయించుకుంటావు నేను సిద్దపడుతుండగా నువు ప్రారంభింస్తావు నేను ఫలితాల అంచనాలు చూస్తుండగా నువు ఓటమితో తిరిగొస్తావు అనివార్య మలుపుల దగ్గర జాగరూకత పాటిస్తూంటే అనవసర ముసుగులతో నిలబడతావు అసలు మనిద్దరిది ఒకే మార్గమయినపుడు ఉన్నట్టుండి బరువైపోతావు ఎందుకు నమ్మకమే లేని సఖ్యతై  నీ చెవి సకల మురుగును స్రవిస్తూంటుందేమిటి నువు మాత్రం పసిపాపవై నవ్వుతూ మాట్లాడుతుంటావు నీ చేతిలో అస్తవ్యస్త ఆయుధాలు రక్తమోడుతుంటాయి నీ వెనుకనుండి కమలాలు విరగబడి నవ్వుతూంటాయి స్వార్థ జ్వాలల నడుమ చండాలిక శిరసును ఖండించిన  ఖడ్గం యూపధారువై దర్శనమిస్తూ కాలకూట గరళ పాచికలను విసురుతున్నది కదా నమ్మడమంటే బలికి సిద్దపడటమే నిత్యం చచ్చే జీవితాలకు సంతాపంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిరంతరం కొనసాగతూంటది అది నువ్వో నేనో ఎవరైనా కరిగేది మాత్రం మనమే ......... 31-10-2017(10.20pm)