పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

  2020 సంవత్సరం "'కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం" గెల్చుకున్న  మానస ఎండ్లూరితో జ్వలిత చేసిన ఇంటర్వూ 1.జ్వలిత : కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన మీకు ముందుగా శుభాకాంక్షలు. ఈ పురస్కారం పొందిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ? మానస ఎండ్లూరి : ఈ పురస్కారం పొందిన అందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అయితే దీన్ని గుర్తింపు అనే కంటే కూడా గౌరవం అనుకుంటున్నాను. ఎందుకంటే అస్తిత్వాన్ని రాసుకునే రచయితలకు వచ్చే గుర్తింపు, గౌరవం ఆ రచయితకే కాదు తన జాతికి తన వర్గానికి వర్తిస్తుందని నమ్మేదాన్ని. ఒక స్త్రీవాదిగా, ఒక బహుజన వాదిగా, ఒక దళిత వాదిగా అట్టడుగు వర్గాల స్త్రీల గురించి ఆ వర్గపు.. ముఖ్యంగా దళిత క్రైస్తవ మనుషుల గురించి నేను రాస్తున్నాను కాబట్టి ఈ పురస్కారం అనేది ప్రతి ఒక్కరిని గౌరవిస్తుందని నేను భావిస్తున్నాను మేడం. 2. జ్వలిత : చాలా గొప్ప భావన, వ్యక్తిగతంగా కాకుండా, అస్తిత్వ స్పృహతో చాలా గొప్పగా ఉంది మీ సమాధానం. విహంగ పత్రిక బాధ్యత, విహంగ పత్రికలో మీ సాహిత్యం గురించి చెప్పండి ? మానస ఎండ్లూరి : విహంగ అనేది అంతర్జాలంలో మొట్టమొదటి మహిళా సాహిత్య పత్రిక. అది 2011ల

యువతను వదలని చెదపురుగులు

 యువతను వదలని "చెదపురుగు"   జ్వలిత -9989198943 బెంగాలీ నవలా చరిత్రలో మొదటి భాగం 1858 లో ప్రారంభమైంది. ఆ ప్రథమ ఘట్టాన్ని బంకించంద్ర ఛటోపాధ్యాయ రవీంద్రనాథ్ శరత్ చంద్ వంటి వారి  నవలలతో సంపన్న మైనది. 1930 నుండి 50 వరకు వంగ నవలా చరిత్రలో ద్వితీయ భాగంగా చెప్పవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత మధ్యతరగతి జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి. విలువలు నశించాయి, అభిరుచులు తారుమారు అయ్యాయి. దేశ విభజనతో పురాతనమైన గ్రామాలలో పరిస్థితి కలలుగానే మిగిలిపోయాయి. నిరాశ నిస్పృహలు ప్రజలను ఆవహించాయి. దేశమంతా  అదే పరిస్థితి ఉన్నా  బెంగాలీ రచనలలో  ముఖ్యంగా నవలలో  ఈ క్లిష్ట పరిస్థితి వస్తువుగా చోటుచేసుకుంది. ఆ సమయంలో నవలా రచయితలు మోతీ నందీ, శీర్షేందు ముఖోపాధ్యాయ, దేబేష్ రాయ్  వంటి వారు 1960 నుండి తమ కథారచనను ప్రారంభించారు. శీర్షేందు ముఖోపాధ్యాయ 1967లో 'ఘూన్ పొకా' పేరుతో తన మొదటి నవలను రాశారు. ఘూన్ పొకా అంటే అర్థం చెదపురుగు అని. మొదటి నవలే శీర్షేందు ముఖోపాధ్యాయకు నవలాకారునిగా పేరు సంపాదించి పెట్టింది. "చెదపురుగు" పేరుతో  తెలుగులోకి అనువాదం చేసిన వారు  బొమ్మన విశ్వనాథం. నేషనల్ బుక్ ట్

గోండు వనంలో కథాకచ్చీరు

గోండు వనంలో బహుజన కథల కచ్చీరు - జ్వలిత, 9989198943     06/01/2014 TAGS: నివేదిక ------ ఆదివాసీ అస్తిత్వం కోసం నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి అమరుడైన కొమురం భీం పోరాడిన జోడేఘాట్‌లో బహుజన కథకుల కచ్చీరు డిసెంబర్ మొదటి వారంలో జరిగింది. అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని ఆవాహన చేసుకునే విధంగా తెలంగాణలోని అన్ని జిల్లాలనుంచి కథకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో కవి, కథకుడు, పరిశోధకుడు గోపగాని రవీందర్, ఆదివాసీ కథకుడు, మెస్రం మనోహర్ పాల్గొన్నారు. కథాసాహిత్యంలో ధోరణులపై కథకులు తమ ఆలోచనల్ని పంచుకున్నారు. అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించారు. పచ్చటి సముద్రం వంటి అడవిలో కొండల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో సమావేశంలో పాల్గొన్న 25 మందికి పైగా కథకులు తమ మనోభావాలను పంచుకున్నారు. కొమురం భీం విగ్రహం దగ్గర నివాళులు అర్పించి కథల కచ్చీరుని ప్రారంభించారు. తొలుత ఒక్కొక్కరు పరిచయం చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కథలు రావాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గతంలో కథపై జరిగిన చర్చల్లో శైలి, శిల్పం బాగాలేదని ఆధిపత్య భావజాలంతో కథల్ని అంచనా వేశారన్నారు. బహుజనుల గళాన్ని విమర

నేను మలాలా 5

 నాయకత్వానికి అర్హత వయసు కాదని చాటిన "నేను మలాల" --పరిశీలన :జ్వలిత-9989198943 "నాకు చదువుకునే హక్కు ఉంది, నాకు ఆటలాడుకునే హక్కు ఉంది, నాకు మాట్లాడే హక్కు ఉంది" అంటూ కవితలు రాసి, కూనిరాగాలు తీసిన మలాలా 1997 జూలై 12న జన్మించింది. ఆమె పాకిస్తాన్ స్వాత్ జిల్లాలోని ఖైబర్ ఫక్తూన్ ఖాహ్ ప్రాంతంలో యూసుఫ్ జాయ్ అనే ఆదివాసీ తెగకు చెందినది. ఆమె తండ్రి జియావుద్దీన్ అభ్యుదయ భావాలు కలవాడు. తాలిబాన్ల చాందస నిరంకుశ నిబంధనలకు వ్యతిరేకంగా మలాలా మనసులో చైతన్య బీజాలను నాటి, బుద్ధుడు ఏసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్తల బోధనలను అర్థం చేసుకునే స్వేచ్ఛను ఆమెకు కలిగించాడు. "నేను మలాలా" అనే పుస్తకం శాంతి నోబెల్ బహుమతి పొందిన ఒక అమ్మాయి కథ. అమ్మాయిలు చదువుకోవాలనే ఆకాంక్షతో తాలిబన్ల ఆజ్ఞను దిక్కరించి, తీవ్రవాద దాడిని ఎదుర్కొన్న సాహస పుత్రిక కథ. పాకిస్తాన్ కు చెందిన ఒక అమ్మాయి చదువుకోవాలనే తన హక్కును కాపాడుకోవడం కోసం, తాలిబన్ల తుపాకులకు గురైంది. అయినా ధైర్యంగా నిలబడి హాస్పిటల్లో కోమాలో నుండి బయటపడి తన ఆత్మకథను రాసుకుంది. ప్రపంచమంతా ఆమె పక్కన నిలిచింది. మొదట స్వయంగా "మలాలా యూసఫ్