పోస్ట్‌లు

మార్చి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ది హౌస్ ఆఫ్ స్పిరిట్ నవల

  మెరిసే అక్షర ాలు (ప్రపంచ సాహిత్యంలో చదవదగిన నవలలు)  జ్వలిత: 9989198943. 'ద హౌస్ ఆఫ్ స్పిరిట్స్' నవలా పరిచయం ద హౌస్ ఆఫ్ ది స్పిరిట్ అనే నవల 1982లో ఇసాబెల్ అలెండా అని ఒక జర్నలిస్ట్ మరియు టెలివిజన్ హోస్ట్ అయిన మహిళ యొక్క రచన. ఆమె చైనా నుండి రాజకీయ బహిష్కృతురాలు.  1981  జనవరి 8 వ తేదీన వెనిజులాలో కూర్చొని దాదాపు వంద సంవత్సరాల వృద్ధుడైన తన తాతకు లేఖ రాయడం ప్రారంభించింది. అందులో ఆమె తన వర్తమానానికి తన కుటుంబం యొక్క గతానికి మధ్య ఉన్న దూరాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.  తన చిన్నతనంలో విన్న ఒక పిట్ట కథతో నవల మొదలవుతుంది. రోజా అనే ఒక స్త్రీ తన గురించి చెప్పినట్టుగా. రోజా  పొరపాటున విషపూరితమైనట్టు రాసింది. 'పోస్ట్ చేయని ఉత్తరాలు' అనే నవల చేతి ప్రతి " the house of the spirit"గా మారి ఒక ఉత్తమ నవలగా రూపుదిద్దుకున్నది.  ఒక స్త్రీ యొక్క మూడు తరాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి స్పష్టంగా చిత్రించింది రచయిత్రి ఈ నవలలో. స్త్రీలకు వ్యతిరేకంగా చిలీదేశం యొక్క అస్థిరత వెనుకబాటుతనాన్ని, 20వ శతాబ్ది యొక్క హింసాత్మక రాజకీయ దృక్పధాన్న, ఈ పుస్తకం పరిచయం చేస్తుంది మనకు

మెరిసే అక్షరాలు

 http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%87-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/?fbclid=IwAR2CWcKgs_1wp3x8Cm0pOxupyJ6lfO9Cn19agEz8F2_HKES3dRGusd0s3bo

వలయం

                     "వలయం"(కథ) రచన: జ్వలిత- 9989198943 "ఎందుకంత నిష్ఠూరం? ఎందుకంత కాఠిన్యం? ఎందుకంత రౌద్రం ? ఎందుకా కఠోర వాక్కులు? ఎందుకా చూపుల్లో కోపం? ఎందుకు? ఎందుకు? మనిషివి కదా! నీకు ఒక మనసు ఉండాలి కదా! దుఃఖం దయ జాలి అంటే తెలుసా నీకు ? ఒక లోహం వలె ఉంటావెందుకు? కాదు కాదు లోహం కనీసం వేడి చేస్తే కరుగుతుంది, ఏదో ఒక స్థాయిలో.. రాయిలా అనడం సరి కాదు. అది కూడా నీకు సరైన పోలిక కాదు. శిల పగిలి ముక్కలవుతుంది. శిల కూడా కరుగుతుంది, అరుగుతుంది. సుత్తి దెబ్బలకు, ఉలి మొనల తాకిడికి ఆకారం మార్చుకొని శిల్పం అవుతుంది. నువ్వేంటీ ? నువ్వేంటి ఇంత కఠినం ? ఇంత నిష్టూరం , రౌద్రం. ఒక విషయం చెప్పు. అసలు కోపం ఎందుకు నీకైనా తెలుస్తుందా? నువ్వు ఎంత క్రూరమో నువ్వెంత నిష్టూరమో? కత్తివేటు కంటే పదునైనది కదా కఠోరమైన వాక్యం. గుండె లోతుల్లోకి దిగి మనోవేదనను కలిగిస్తుంది తెలుసా". "నన్నేమి అడగకు, నేనేమి చెప్పను. నీ కెందుకు? అసలు నేను నీకెందుకు చెప్పాలి ? నేనింతే, నేను ఇలానే ఉంటా". "అదే ఎందుకు అట్లా ఉంటావు? అది నీకు సుఖంగా ఉందా ? ఈ కాఠిన్యం నీకు సౌకర్యంగా ఉందా? ఆ నిష్ఠూరాలు,.నీకు మనశ్శా