పోస్ట్‌లు

శిశిరోన్ముఖం(కథ)

శిశిరోన్ముఖం జ్వలిత "ఒరే పవన్ మీ పెళ్ళెప్పుడురా…?" శీను. "ఏమో మామా నాకీజీవితంల పెళ్ళిరాతలేనట్టుంది. అనిత పెళ్ళొద్దంటున్నది" దిగులుగా అన్నడు పవన్. " అదేంటిరా.. ప్రేమించుకున్నమంటివి కదా.. పెళ్లి ఎందుకు వద్దట? విచిత్రాల పిల్లలురా మీరంతా.." విసుక్కున్నడు పవన్ మామ శీను. "విచిత్రం ఏమీ లేదు.. అనితకు పెళ్ళంటె ఇష్టం లేదు.." పౌరుషంగా జవాబిచ్చిండు మేనల్లుడు పవన్. "అంటే.. పెళ్ళి లేకుంట కలిసుంటరా? వాళ్ళోళ్ళు ఒప్పుకుంటరా? మీ అమ్మ నాయన ఊకుంటరా ? నన్ను ఇరికించకొరేయ్.." భయంగా అన్నడు శీను. "కలిసుంటె తప్పేంది ? కోర్టు కూడా 'సహజీవనం' న్యాయ సమ్మతమే అన్నదికదా ! అయినా అనిత కలిసి ఉండదు, పెండ్లి చేసుకోదు. ఇందుల నిన్ను ఇరికిచ్చుడేమి లేదులే.." నసిగిండు పవన్. "అబ్బ.. ఏందిరా నీ గోల? సరిగ చెప్పు" పంచర్ ఏస్తున్న సైకిల్ ట్యూబ్ నీళ్ళల్ల వదిలి వచ్చి, పవన్ పక్కన సిమెంట్ అరుగు మీద కూసున్నడు శీను. మళ్లీ తనే "పెళ్ళి చేసుకోరు, కలిసుండరు.. ఉత్తగనే ప్రేమ పచ్చులోతిగ జీవితమంతా.. షికార్లు తిరుగుతరా" చతురాడిండు .  "నీకు పరాసికం అయితంది...

హితురాలు భూమిక

'హితురాలు భూమిక' జ్వలిత భూమికతో నా అనుభవం నా జీవితంలా చాలా చిత్రమైంది. 1975లో పదోతరగతిలో పెళ్ళితో ఆగిపోయిన నా చదువు. ఇద్దరు సంతానం తర్వాత ఇంటర్ లేకుండా 1985లో హైదరాబాద్లో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీతో తిరిగి మొదలయ్యింది. తెలుగు పండిట్ ట్రైనింగ్ పూర్తిచేసి 1995లో నా 35వ ఏట ప్రభుత్వ ఉపాధ్యాయినిగా హైదరాబాదు నుండి సత్తుపల్లి చేరాను.1998లో ప్రమోషన్ పొంది రామవరం పాఠశాలకు చేరాను. చాలా పెద్ద ఆవరణ, పెద్దపెద్ద చెట్లతో, విశాలంగా సిమెంటు రేకుల షెడ్లతో, అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులున్న చారిత్రాత్మక పాఠశాలది. ఎందుకంటే 1960 ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. సింగరేణి బొగ్గుగనుల ప్రాంతం. విద్యార్థులు కూడా సింగరేణి కార్మికుల పిల్లలే ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలే ఎక్కువ. ఒక్క శాతం మిగిలిన వారి పిల్లలు. విచిత్రమైన వాతావరణం రాత్రిళ్ళు అధిక చలి, పగళ్ళు భయంకరమైన వేడి. మండే ఎండలు, వదలని ముసురు, వణికించే చలి అన్నీ ఎక్కువే. వాతావరణం వలెనే అక్కడి మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలలో కూడా మిగిలిన ప్రాంతాల్లో కంటె భిన్నంగా ఉండేవి. ఒకే తండ్రి ముగ్గురు తల్లుల సంతానం ఒక తరగతి గదిలో విద్యార్థులుగా బ

స్ఫూర్తి

స్ఫూర్తి — జ్వలిత యుద్దాలను ఉత్పత్తి చేసేవాని రక్తకాంక్ష నెత్తుటేరులను కలగంటున్నది  అధికారాహంకారం పాలబడిన గాజా  భయంకర మృత్యుహేల మోగిస్తున్న బాజా భీతిల్లిన పసిమోములు  రక్తమోడే దేహాలు  నెత్తుటి ముద్దలైన ఖండిత తనువులు వలస సమూహాల మధ్య  అణుబాంబై పేలుతున్న భయం ఆయుధాలను కలగంటూ  ఆదాయాన్ని పెంచుకునే  మారణ హోమం  ప్రకృతి సహజమైన ప్రేమను మరిచి సామూహిక హనానాలతో  పైశాచిక మృత్యు క్రీడ  బాల్యంలోనే పసి జీవితాలకు  అంత్యక్రియలు లేని  అంతిమ గీతాలు పాడుతున్నది  మరణాల జోల నిస్సహాయ శరణార్థ శిబిరాలు  గాలి వెలుతురు శూన్యమైనా  అధికారం అస్తిత్వాన్ని వేటాడుతున్నది  డాలరు పడగనీడన  వంద సంవత్సరాలుగా  సలుపుతున్న పచ్చి గాయం  శత్రువును ఓడించేందుకు చేస్తున్న  ప్రతిఘటనే ఒక ఆయుధం హింసాత్మకంగా ఆపేస్తున్న  ఉసురుల మధ్య  ఊపిరి తీసుకోవడమే ధిక్కారం మానవ జాతి సంరక్షణకై దేవునితో పోరాడిన  ‘ప్రొమీథీయస్’ స్ఫూర్తి మానవాళికి ఆదర్శం ఇప్పుడు       —--------- పాలస్తీనా కవితా సంకలనం డా. గీతాంజలి 18/01/24

సంకల్పం

సంకల్పం (కథ) జ్వలిత- 9989198943 "రేపు సైట్ ఇన్సిపెక్షన్ ఉన్నది వర్కిన్సిపెక్టర్, ఇంజనీర్ భోజనాలకొస్తరు, వంటకాడికి నువ్వు కూడా పో, వంటలు బాగలేక పోతే, పని కరాబైతది, ఏదో ఒక వంక పెడ్తరు చెరువుకట్ట కట్టుబడిని" అన్నడు జానమ్మ మొగడు రాత్రి ఆన్నం తిని పండుకునే ముందు. "అయ్యో ! రోజు నే బోకుంట అంత వంటామె మీద వదలి పెడతన్ననా ! నా కోసమన్న రుచిగ వండుకోవాలె కదా!" అన్నది జానమ్మ. "నిజమే లే, కానీ రేపు కొద్దిగ జాగ్రత్తగ వండండి. నాటు కోడి కోసితెస్తడు సారయ్య. మంచిగ మరింత అల్లమేసి వండాలే. పనోళ్ళకు పోసే పప్పుచారు కాకుండా, వేరే చిక్కగ చేయించు, దోసకాయ పచ్చడి, గడ్డ పెరుగు ఉండేట్టు చూడు" అన్నడు. "సరె సరె ఇంగ పండుకో అన్నిటికి బుగులే నీకు" అన్నది. అడువుల్ల రోడ్లేసుడన్నా, చెరువు కట్టలు కట్టుడన్నా మద్దెల దరువే గుమస్తాలకు. గుత్తేదార్లు పట్నంల కూసుంటరు బద్రంగ. అడవిల అన్నలొచ్చినా , ఆఫీసర్లొచ్చినా గుమస్తాలకే ఉరుకులు పరుగులు. కమలాపురం అడువుల్ల కామారం దగ్గర చెరువు కట్ట కడతాన్రు. అక్కడ గుమస్తా జానమ్మ మొగడు. తాడ్వాయి దగ్గర కామారంల కొయ్యోళ్ళ ఇంట్ల ఉండుకుంట పని చేయిస్తాండు. రోజు పాతిక మంద

పోరి (కథ)

'పోరి' జ్వలిత- 9989198943 త్రిస్టార్ హోటల్లో ఏ.సి.రూమ్ లో ఉన్నారు వాళ్ళిద్దరూ.. విచారంగా ఉన్నట్టున్న ఆ స్త్రీ వయసు తెలవట్లేదు. ఆకర్షణీయంగా చదువుకున్నట్టే కనిపిస్తుంది. అతడొక పత్రికా విలేకరి రచయత కూడా. ఇద్దరూ చెరొక కుర్చీలో ఉన్నారు. టీపాయ్ మీద ఒక వాటర్ బాటిల్, రెండు ఎంగిలి కప్పులున్నాయి. "మొదలు పెడదామా" అన్నాడతను. "రికార్డు చేస్తారా.." అన్నదామె. "మీకభ్యంతరం లేకపోతే" అంటూ వీడియో కెమేరా సెట్ చేశాడు. "అతడితో మీకెందుకు తగాదా వచ్చింది".. "నా 'ఆనంద ధామం' మీద కన్నేశాడు. దాన్ని లాక్కునేందుకు 'బ్రోతల్ హౌజనీ, చిన్నపిల్లలతో వ్యభిచారం చేయిస్తున్నాననీ' ఏవేవో ప్రచారాలు మొదలు పెట్టాడు. నన్ను జైలుకు పంపి అందులో వాళ్ళను అనాథలుగా రోడ్డు మీదకు నెట్టి, ఆనంద ధామాన్న స్వాదీన పరుచుకోవాలన్న స్వార్థం" ఆగిందామె. "అతనేమయ్యాడు.. కనిపించటం లేదట కదా.." "నాకు తెలియదు నేను నా గురించి మాత్రమే మాట్లాడుతా.. మధ్యలో ఆపొద్దు. ఆపితే వెళ్ళిపోతాను. మీకు తెలుసు మీరు నన్ను ఆపలేరు" కఠినంగా స్థిరంగా అన్నదామె. "తెలుసు తెలుసు.. మధ్యలో

గుల్దస్తా(కథ)

"గుల్దస్తా" జ్వలిత - 9989198943 అదొక గిరిజన ఆవాసం, తండా, గూడెం, గుంపు అని కూడా పిలుసుకుంటారు వాళ్ళు. మిగిలిన నాగరిక ప్రజలు కూడా అట్లాగే పిలుస్తారు. నగరవాసులంటే వారికి భయం. నాగరికులంటే మోసగాళ్ళని వారి అభిప్రాయం. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, న్యాయస్థానాలంటే మరీ భయపడతారు. వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు.  చుట్టూ అడవులు పర్వతాల నడుమ రెండు మూడు గుంపులుగా కొన్ని గిరిజన కుటుంబాలు దాదాపు వంద సంవత్సరాల నుండి ఆ చీకటి జీవితాలను వెళ్ళదీస్తున్నారు.  స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా అక్కడికి రోడ్లు, కరెంటు వంటి సౌకర్యాలు చేరలేదు. పాఠశాల, వైద్యశాల వంటివి వారికి తెలియదు. అయితే వారి సంప్రదాయాలు ఆచారాల ప్రకారం పండుగలు, ఉత్సవాలు చేసుకొని ఆనందిస్తారు.  వసంత పండుగ సమయమది. ఆ గుంపుల్లో యువతులంతా నిద్ర లేవగానే, రంగు రంగుల ముగ్గులు వాకిళ్ళలో, గోడల మీద చిత్రించడంలో మునిగిపోయారు. కనీసం ముఖం కడుక్కోడానికి కూడా ముగ్గులు వేయడం ఆపట్లేదు. తెలుపు పసుపు రంగులతో గోడలన్నీ అలికారు. వరండాలని నలుపు పసుపు రంగులతో. ఉల్లాసం కలిగించే డిజైన్లను చిత్రించారు. గోడల మీద వరండాలో బియ్యం పిండిని నీటిలో కలిపి రంగులతో ముగ్గు