పోస్ట్‌లు

జులై, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రత్యామ్నయం( కథ)

ప్రత్యామ్నయం మప్పయి సంవత్సరాలు టీచరు ఉద్యోగం చేసి రిటైర్ అయిన  సుబ్బయ్యకు పెళ్ళియిన దగ్గర నుండి వేరే ఊళ్ళో ఉండే కొడుకు పిల్లలకు మధ్య చనువు తక్కువ. సంవత్సరానికి ఒక సారి వాళ్ళు తన దగ్గరకొచ్చినా, ఆ ఒక్కరోజు రెండు రోజులు తను వాళ్ళ దగ్గరకు పోయినా పిల్లల పరిస్థితి అంతే. రిటైర్ అయినంక గమనిస్తే చిన్న మనవడు చదువులో వెనుక బడి ఉన్నాడు. గరాబం ఎక్కువ. టీవీల 'డోరోమెన్' కర్టూన్ చూడటం యిష్టం. నేను వాడికి చదువు చెప్పనా అంటే నీకు వాడికి చెప్పడం రాదులే అన్నాడు కొడుకు. మనవడికి చదువు అంటే తల్లి మాట వినడు. తండ్రికి తీరికుండదు. మెల్లగా చిన్న బోర్డ్ మీద చిన్న చిన్న బొమ్మలేసి అక్షరాల మీద ఆసక్తి కలిగించాడు. మనవనికి కూడా బొమ్మలు గీయడం ఇష్టం. కథలు చెప్తూ  అందులో వచ్చే పదాలకు బొమ్మలు గీస్తూ అక్షరాలు నేర్చుకొనేవాడు. తాతా మనవల మధ్య బెరుకు తగ్గింది. బడికి  వెళ్ళేపుడు బై తాతయ్యా అని‌, బడి నుండి రాగానే తాతయ్యా అంటూ దగ్గరికొచ్చే వాడు. ఒక రోజు హోమ్ వర్క్ పుస్తకంలో parts of the body అని రాసి ఉన్నాయి. నోస్ ఇయర్ ఐ అన్నీ చెపుతున్నాడు మనవడు రాయడానికి spellings రావట్లేదు. మూడింటికి మనవడు బడి నుండి వచ్చే సరికి కి