పోస్ట్‌లు

మార్చి, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ ఓడిపోయింది

టీచర్  వాడు చచ్చి పోయాడు"ఆనందంగా చెప్పింది సంతోషి. "వారం రోజులు బడికి రాలేదు ఎందుకు అంటే .. ఎవరో చచ్చిఫోయారంటవేం" మందలించింది టీచర్. "అవును టీచర్, నేను పుట్టినందుకు మా అమ్మను కొట్టి.. అమ్మను వదిలేస్తానని. నన్ను అక్కను చంపుతానన్నవాడు. తాత వాడి కాళ్ళు పట్టుకొని బతిమిలాడితే అక్కను మాత్రమే సాదడానికి  ఒప్పుకున్నవాడు .. ఇన్నేళ్ళు నాకు అమ్మను దూరం చేసినవాడు చచ్చాడు టీచర్"ఉద్వేగంగా  చెప్పింది సంతోషి. జలధి టీచర్ ఆ పసిదాని పరిస్థితి కొంత అర్థం చేసుకుంది. "సరె సరె నువ్వెందుకు ఎళ్ళావ్ వాడు చస్తె, వాడంటె నీకసహ్యం కదా" టీచర్ అడిగింది. "అదె టీచర్ వాడు చస్తె చూడ్డానికి  కూడా రానన్నదట మా అక్క . అంతగా హింసపెట్టాడు అక్కను వాడు.ఏదొ స్నేహగృహం అని బాధిత మహిళల కోసం పనిచేస్తుందట అక్కడ తలదాచుకుంటున్నది. మా తాత పట్టుపట్టి తీసుకు పొయ్యాడు . నేనే తలకొరివి పెట్టి వచ్చావాడికి" గాలి పీల్చుకుంది ఆఅమ్మాయి. పిల్ల వెంటే తోడుగా వచ్చి బయటె నిల్చున్న నరసయ్య ఆ మాటలన్ని వింటున్నడు. మరి మీ అమ్మ మీతొ వచ్చిందా.?అడగింది టీచర్. "రాలేదు. ఐదు సంవత్సరాలు కాంట్రాక్టుకు మా అమ్మను 

ఆమెలకు భయపడిన సన్నాసులు

ఆమెలకు భయపడుతున్న సన్నాసులు-జ్వలిత ప్రపంచమే పరివారమైన వారిని సత్తుగింజల గుంపులో సత్యమున్న మనుషుల్ని ఒక్కొక్కరినీ వెంటాడి వేటాడే ఆటనడుస్తున్నది సంతులు సన్నాసులంతా కలిసి ఆయుధాలతో వేదాలు పలుకుతుంటే ఆమెలెవరైనా ప్రశ్నలను ధరిస్తే హత్యలకు అత్యాచారాలకు ఫలహారాలే యాగాలు చేస్తూ చంపేస్తారు మంత్రాలు చదువుతూ చంపేస్తారు యంత్రాలు గా మారి చంపేస్తారు అక్కడ పోరాటాలు చేసినవారు రంగులు మార్చి వేలసమూహాలను రక్తసముద్రాలు చేస్తే ఇక్కడ అక్షర వీరులను సంతులు చంపుతున్నారు చంపడమన్నది ప్రపంచాన్నేలుతున్న సరికొత్త క్రీడ హత్యారాజకీయాల సుఖరోగాల సన్నాసుల్లారా కలం పట్టి నిలబడ్డ ఆమెను చూస్తే భయమేసిందా అవును అక్షరాల ఆమే గెలిచింది ఆమెను చంపిన మీ పిరికితనం ఓడింది దేశమంటే సన్నాసులు కాదురా సన్నాసీ దేశమంటే ఆమెతనాన్ని మరిచిన మనుషులున్న నేల కదా ఎవరూ ఆమెలకు భయపడకండీ +++-------+++ (హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీలంకేష్ కు అక్షరనివాళి) ది.6/8/2017.11.30

పాము

పాము సరే విషం కక్కింది మనిషివి కదా మరినువ్వేమి చేశావు గుండె మార్పిడి చేయించా వేప సరే చేదు నువ్వేం చేశావు తేనె కలిపి చప్పరించా ఔషధం అయ్యింది

చూపులు

చాలా కష్టం చూపులు తట్టుకోవడం గడ్డం ఆన్చి కూర్చొమని కళ్ళల్లో కళ్ళు పెట్టి గుచ్చుకువే  కాంతి చూపులు తట్టుకోవడం మరీ కష్టం కళ్ళు మూసుకొని ఎదురు చూస్తూండడం మరీ కష్టం           ఓ ఊహించుకోకండి... (కళ్ళల్లో చుక్కల మందేసి కళ్ళు మూసుకొని కూర్చోమన్నపుడు)

వె

వెలుగు చూడని విజేత-1 8/3/2018 అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా ఒక విజేతను పరిచయం చేస్తాను. 1988లో పరిచయం అయిందామె నాకు దాదాపు మేమిద్దరం ఎవరి యుద్దాలు వారు వేరువేరుగా చేస్తున్న సమయంలో ఆమె నాకు ప్రేరణ. 1980లో హైదరాబాద్ వచ్చిన నేను1987లో మా వారు పనిచేస్తున్న కంపెనీ లాక్కౌట్ కావడంతో తిరిగి మా అత్తగారి ఊరు గంధంపల్లి వచ్చి హోటల్ పెట్టుకున్నాం ఒక సంవత్సరం తరువాత కంపెనీ ఓపెనయి తిరిగి హైదరాబాద్ వచ్చాం.(ఇక్కడ చాలా చెప్పాలి తరువాత మరొక సారి చెప్తాను) 1988 కుకట్పల్లి బాలాజీనగర్లో అద్దెకు దిగాం దగ్గర్లో ఒక రేకుల ఇంట్లో ఒక నర్స్ ఉండేది ముగ్గురాడపిల్లలతో డా.ప్రతాపరెడ్డి పీపుల్స్ హాస్పిటల్లో పనిచేసేది తర్వాత శివానంద  లెప్రసీ రిహాబిలేటేషన్ సెంటర్లో పనిచేసేది. ఎవరు పిలిచినా వెళ్ళి సూదులేసొచ్చేది. బాధితులకు తనకు తోచిన సేవలు చేసేది. ఆదివారం క్రీస్తు ప్రార్థనలు చేసేది. ఎప్పుడూ సీరియస్ గా ఎక్కువ పనిచేస్తూ తక్కువ మాట్లాడేది. ఆమె నవ్వగా ఎప్పుడూ చూడ లేదు నేను. వాళ్ళ పెద్దమ్మాయి షీబా పరిచయమయ్యింది నాకు. వాళ్ళింటి ముందు నుండి నేను పనిచేసే పాఠశాలకు వెళ్ళేదాన్ని.(బాగంబీర్ లో రామకృష్ణ స్కూల్. రంగారెడ్డి

నీళ్ళు కవిత

>ఏసంగెనక ఏసంగెనక తొలకరివాన నీల్లగురించి ఎంత సెప్పిన తక్కువనే ఆశల ఆకాశంలో అధికభాగం అవినీతి నీల్లే నల్లటియన్నీ నీల్లుకావు - తెల్లటియన్ని పాలు కావు అన్నరు గురువులు ఎర్రటినెత్తుర్ను తెల్లటి పాలు సేసి రొమ్ము గుడిపిన్రు అమ్మలు రక్తాన్ని సెమటనీల్లు సేసి బతుకిచ్చిండ్రు అయ్యలు అమ్మనాయన ఆశలకు నీల్లొదిలి గుడంబనీల్లకు అలవాటయి నీల్లు లేక ఎండిన పంటలోతిగ కూలబట్టిరి పోరగాల్లు బొట్టు బొట్టు నీటి సుక్క పొదుపు సేసి రేపటి తరానికి పాఠం చెప్పమంటది మొగులు మొక్కను మొక్కను కాచి వనాలను పెంచమంటది అడవి అడవి భూముల హక్కులను కాపాడ మంటది కొండ కొండ దాపున నిధులకు మర్మజలధారలకు ఆశపడుతున్నది నగరం తియ్యటి కొబ్బరనీల్లసుంటి మాటలు కమ్మగ సెప్పాలని నాకు సుత నోట్ల నీల్లూరుతన్నయి కని ఏమి సేద్దును తేజాబ్ నీల్లు తాగి సచ్చిన ఔసల కుటుంభాలు పురుగు మందు తాగి లోకాన్నొదిలిన రైతు కుటుంభాలు యాదికొచ్చి నీల్లుకు దూప కాదు కంటి కునుకు రాదు దుఃఖం మీద నీల్లు జల్లి మల్ల లేసి నిలబడమంటది మనుసు నేను కలగంటున్నది నీల్లనే అవును నేను కలవరిస్తున్నది నీటినే ఆడపొల్లని పుట్టకముందే ముంచేస్తున్న ఉమ్మనీటిని సిరియా శిశుమేధ