ఆమెలకు భయపడిన సన్నాసులు

ఆమెలకు భయపడుతున్న సన్నాసులు-జ్వలిత ప్రపంచమే పరివారమైన వారిని సత్తుగింజల గుంపులో సత్యమున్న మనుషుల్ని ఒక్కొక్కరినీ వెంటాడి వేటాడే ఆటనడుస్తున్నది సంతులు సన్నాసులంతా కలిసి ఆయుధాలతో వేదాలు పలుకుతుంటే ఆమెలెవరైనా ప్రశ్నలను ధరిస్తే హత్యలకు అత్యాచారాలకు ఫలహారాలే యాగాలు చేస్తూ చంపేస్తారు మంత్రాలు చదువుతూ చంపేస్తారు యంత్రాలు గా మారి చంపేస్తారు అక్కడ పోరాటాలు చేసినవారు రంగులు మార్చి వేలసమూహాలను రక్తసముద్రాలు చేస్తే ఇక్కడ అక్షర వీరులను సంతులు చంపుతున్నారు చంపడమన్నది ప్రపంచాన్నేలుతున్న సరికొత్త క్రీడ హత్యారాజకీయాల సుఖరోగాల సన్నాసుల్లారా కలం పట్టి నిలబడ్డ ఆమెను చూస్తే భయమేసిందా అవును అక్షరాల ఆమే గెలిచింది ఆమెను చంపిన మీ పిరికితనం ఓడింది దేశమంటే సన్నాసులు కాదురా సన్నాసీ దేశమంటే ఆమెతనాన్ని మరిచిన మనుషులున్న నేల కదా ఎవరూ ఆమెలకు భయపడకండీ +++-------+++ (హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీలంకేష్ కు అక్షరనివాళి) ది.6/8/2017.11.30

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష