పోస్ట్‌లు

మే, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏమి బతుకు - ఏమి బతుకు (పాట)

బడులులేకా తిండిలేకా బుజ్జిపిట్ట అరవబట్టే కానికష్టం హాష్టలేమో తలుపుమూసే లాకుబడే ఎర్రకాల్వ ఎండదాయె ప్యాడులేమో దొరకవాయే ఎంతకష్టం ఎంతకష్టం ఆడబిడ్డది ఎంతకష్టం సుక్కదొరక దారిలేక బిక్కుబిక్కుమంటవుండే మాయదారి రోగమొచ్చి ముసలితల్లీమూల్గుతుండే ఏమిచేయ దారిలేక చిన్నపోర్లకు హింసపెరిగే ఎంతకష్టం ఎంతకష్టం పసివాళ్ళకెంత కష్టం సాఫ్ట్వేర్ కొలువు లాయె ఇంటి నుండే వర్కులాయే స్మార్టుఫోను బతుకులాయే మానసిక రోగమాయే అనుమానం పురుగుకుట్టి గెలికిగెలికి ఎతకబట్టే ఎంతకష్టం ఎంతకష్టం కొలువులమ్మకెంతకష్టం పార్కులేదు నడకలేదు సొల్లుకార్చ సందులేదు పనిపాట లేకపోయె పాతలోకం తలవబట్టే ఇంటిదాని రంకులంటా తవ్వితవ్వి వెదకబట్టే ఎంతకష్టం ఎంతకష్టం ఆడవాళ్ళాకెంత కష్టం పగలు రాత్రీ వదలకుండా రారమ్మనిగుంజుతుండే పండు ఓలే ఒలుసుకోనీ గుటకలేసి కొరుకుతుండే కోరుకోనీ కడుపులేమో ఆగకుండా పండబట్టే ఏమిబతుకు ఏమిబతుకు ఆడబతుకు ఆడబతుకు పనులులేక దిగులుపెరిగి పచ్చివోలే బెదురుతుండే ఊరుపోనూ దారిలేదు ఆకలేమో తీరకుండే ఆడఈడా అప్పుతేను ఆడదాన్ని బాదుతుండే ఏమిబతుకు ఏమిబతుకు ఆడబతుకు ఆడబతుకు