పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

హిందీ అనువాదం

 आत्म विश्वास ही हमारा हथियार"  कॅरोना, क्या है तेरा रोना? विकारी के अंत मे आकर क्यों दिखलाती हो तुम्हारा विकृत रूप? यह उचित नहीं है सोचो,ना! हम राण से डरने वाले भीर नहीं हैं फिर भी हम शांति चाहने वाले वीर हैं। कालरा, छोटी माता, एडस से लेकर स्वाइन फ्लू तक किसी बीमारी हमारे सामने खड़ा भी नहीं। तेरी हैसथ क्या उससे भी बड़ा है? कॅरोना, हमे क्या है तुम से यह हैराना? चाहे, संसार भर में तुम 200 से बढ़ कर विविध राष्ट्रों में जुलूस किया भी हो, हमारा भारत में तेरा चाल कभी नहीं चलेगा सोचो। हमारे भिषक बृंद हीरे जैसे दृढ़ चित्त हैं। निरंतर जनताकी रक्षा करने में मगन होने वाले रक्षक दल हैं हमारे यहाँ । एक पल के लिए भी जन सेवा से नजर नहीं छुपाते हैं हमारे पालक श्रेस्ठ। सदा सफाई करने से पीछे नहीं हटते हैं हमारे कर्म चारी लोग। चारो प्रकार के युद्ध दल से हम संसिद्ध हैं तुम्हें भगाने के लिये। तुम कितना भी कोशिश करो, तुमारा राज नहीं चलेगा यहाँ। हमे पता चल गया है कि तेरा चरबी ही तेरी जान है। उसे मिटाकर, तुझे अंत करने के लिये हमारे मेधावी गण जुटे हुए हैं। आत्म विश्वास ही हमारा

నెచ్చెలి

 https://www.neccheli.com/2020/09/బహుళ-3-దాసరి-శిరీష/

సంగడి ముంత సమీక్ష

చిత్రం
  HOME OLD ISSUES (PDF) E-MAGAZINE CONTACT US స్త్రీ విముక్తిని కోరే జ్వలిత ‘సంగడిముంత’ admin  |  May 1, 2020 ‘‘అనాదిగా వెలి వేయబడ్డ నేను/ అక్షరాలను వెలిగించి అంధకారానందాన్ని తగలబెడుతున్నాను/ నా వెంట ఆత్మవిశ్వాసపు అన్నలు/ ఆత్మాభిమానపు అక్కలు/ పూలు మొగ్గులు నా సైన్యం’’ ఈ కవిత చదివితే జ్వలిత అంటే ఎవరో ఏమిటో తెలిసిపోతుంది. జ్వలిత గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగంలో కవయిత్రిగా రచయిత్రిగా రాణిస్తున్నారు. ఈమె 2007 నుంచి ‘‘కాలాన్ని జయిస్తూ నేను’’ అనే మొదటి కవితా సంపుటితో మొదలు పెట్టి ‘‘సుదీర్ఘ హత్య’’, ‘‘అగ్ని లిపి’’ ‘‘సంగడి ముంత’’ అనే నాలుగు కవితా సంపుటాలను, రెండు కథా సంపుటాలను, వ్యాసాలు, అనువాదాలు కలిపి మొత్తం ఎనిమిది పుస్తకాలను రచించి, ముద్రించారు. జ్వలిత ఆధునిక కవయిత్రి. ఆధునిక భావాల వ్యాప్తి కోసం శ్రమిస్తున్న రచయిత్రి. ఈమె ఏ ఒక్క వర్గానికో కులానికో కాకుండా, సమాజాభిద్ధివృద్ధికి అడ్డు వచ్చే వాటన్నిటినీ తన కలం ద్వారా ఎదిరిస్తోంది. ముఖ్యంగా స్త్రీస్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం కలం పట్టినట్లు ఈమె రచనలు చదివితే తెలుస్తుంది. ఇటు సాహిత్యోద్యమంలో, అటు సామాజిక ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, మహిళల

అత్యాచారాల పై కవిత్వం

 తెలుగు సాహిత్యంలో అత్యాచారాల పై కవిత్వం(శీర్షిక) జ్వలిత-9989198943 యుగయుగాలుగా పంజరం పై పక్షి చేసే యుద్ధమే కవిత్వం. యుగయుగాలుగా అణిచివేతకు హింసకు గురవుతున్న మానవి, తనపై జరిగే అత్యాచారాల గురించి రాసిన కవిత్వమే నేటి నా చర్చ అంశం. యుగయుగాలుగా అనుభవిస్తున్న హింసాత్మక సముద్రాన్ని , నెత్తురోడుతున్న ఆకాశాన్ని ,గాయాలతో సలుపుతున్న భూమిని, ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు నిర్భయ మొదటిది కాదు దిశ చివరిదీ కాదు. కానీ జరుగుతున్న సంఘటనల పై కవిత్వం గురించి ప్రస్తావించడం కోసం ఒక నిర్దిష్టమైన కాలాన్ని సూచించడం కోసమే.మ నిర్భయ కంటే ముందే పూలన్దేవి రమీజాబి వంటి వారున్నారు. దిశ తరువాత మానస వంటి ఎందరో బాధితులున్నారు. ఇప్పుడు అసలు అంశంలోకి వస్తే నిర్భయ సంఘటన తర్వాత వెజైన్ మోనో లాగ్ అనే కవితను ప్రస్తావిస్తాను . "ఈ వ్యవస్థ ముఖం మీద/ నా సిగ్గుబిళ్ళను విసిరేసి వెళ్తున్నాను/ అత్యాచార చరిత్ర పేజీలేని నేల మీద/ మళ్లీ వెజైనా తో పుట్టాలని ఉంది / మళ్ళీమళ్లీ స్త్రీగానే అంటారు నువ్వు నీ సెక్యూరిటీ కలిసి/ ఒక చిన్న వెజైనా రక్షించ లేక పోయాయి" అంటూ వ్యవస్థ మీద ఉమ్మారు కవయిత్రి. "నా మీద ల

పథేర్ పాంచాలి-4

 "పథేర్ పాంచాలి" ఆగని గ్రామీణ గానాలాపన జ్వలిత "పథేర్" అంటే పథం, రహదారి, మార్గం అని అర్థం. "పాంచాలీలు" అనేవి తరతరాలుగా సంప్రదాయ కథాగానానికి ఉపయోగించే బెంగాలీ గీతాలు. "పథేర్ పాంచాలి" బిభూతి భూషన్ బంధోపాధ్యాయ స్వీయ కథాత్మక బెంగాలీ నవల.1928-29 మధ్య "విచిత్ర" పత్రికలో సీరియల్ గా రాశారు. నవంబర్ 1929లో పుస్తక రూపంలో వచ్చింది. బెంగాలీ సాహిత్యంలో పేరెన్నికగన్న ఈనవలను సత్యజిత్ రే చలనచిత్ర రూపకల్పన చేయడంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. సత్యజిత్ రే తన చిత్రానికి "సాంగ్ ఆఫ్ ది లిటిల్ రోడ్" అనే ఉప శీర్షికను ట్యాగ్ లైన్ గా జోడించారు. ఈ బెంగాలీ నవలను అదే పేరుతో మద్దిపట్ల సూరి తెలుగు సేత చేశారు. తొలి ముద్రణ 1960లో విశ్వవాణి పబ్లిషర్స్, విజయవాడ వారు చేయగా , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఫిబ్రవరి 2008, జూలై 2009, 2012లలో ముద్రించారు. (అట్ట మీద బొమ్మ సత్యజిత్ రే పథేర్ పాంచాలి చిత్రంలో దుర్గ పాత్రలో ఉమాదాస్ గుప్త.) చింత, నిశ్చింతల మధ్య ఊగిసలాడే జీవన పయనంలో ఎన్నో మలుపులు, ఒడిదుడుకులు అయినా సరే ఆ నడక ముందుకు సాగుతూనే ఉంటుంది. స్థల కాలాదు

బషాయ్ టుడు3- అన్ని సార్లు ఎట్ల

 "బషాయి టుడు" అన్నిసార్లు ఎట్లా మరణించాడు (పరిశీలన - జ్వలిత- 9989198943) 1967 మే జూన్ మాసాల్లో ఉత్తర బెంగాల్ లోని నక్సల్బరీ ప్రాంత రైతాంగ ఉద్యమం దాని నేపథ్యం ద్వారా "బషాయి టుడు" రచనకు స్పూర్తి అని రచయిత్రి మహాశ్వేతాదేవి తన ముందుమాటలో చెప్పుకున్నారు. డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీ, ఖడీబాడీ, ఫంసీదేవా ప్రాంతవాసుల లో చాలా ఎక్కువ మంది ఆదివాసులు భూమిలేని రైతులు. మేది, లెప్చా , భూటియా, సంతాల్ , ఓరావో, రాజ్భన్వీ , గూర్ఖా వంటి వేరు వేరు తెగలకు చెందినవారు స్థానిక జోతేదారులు "పంట వాటా పద్ధతి" అని దోపిడి విధానం కింద వాళ్లను యుగయుగాలుగా పీడిస్తూ ఉన్నారు. జోతేదారులు భూమి లేని రైతులకు విత్తనాలు, అరకలు, పశువులు కొద్దిపాటి తిండిగింజలు విదిల్చి, ఆరుగాలం వాళ్లు కష్టం చేసి పండించిన పంటలో పెద్ద వాటాను జోతేదారులు గద్దల్లా తన్నుకు పోతారు. యుగయుగాలుగా చాకిరీ చేసేవారికి భూమిలేక తిండికి కూడా లేక కష్టాలు అనుభవిస్తూన్నారు. వాళ్ల ప్రతిఘటనలు ఆ క్రమంలో సంభవించిన సంఘర్షణలతో ప్రభుత్వం 1954లో ఎస్టేట్ స్వాధీన చట్టం తెచ్చింది. అనేక చట్టాలు ప్రభుత్వం చేసినప్పటికీ వాటివల్ల ఎటువంటి ఉపయోగం

విత్తన సైనికులు- కథ

 విత్తన సైనికులు (కథ) పొద్దువాలుతున్నా అన్నానికి రాని కొడుకు కోసం ఆత్రపడుతూ కూర్చుంది శాంతమ్మ. నాలిగింటప్పుడు పొద్దటి మీటింగ్ లో చూసిన ఆఫీసర్ను , యువతీ యువకుల్ని తీసుకొని ఇంటికొచ్చాడు శివ. శ్యామల అందర్నీ కూచ్చోమని తాగడానికి మంచినీళ్ళిచ్చింది. శివ తల్లిని పిలిచి వాళ్ళను పరిచయం చేశాడు. ఆమె వారికి నమస్కారం పెట్టింది. " మీ శివ చాలా తెలివైన వాడు ధైర్య వంతుడమ్మా. అందరూ చదువుకొని ఉద్యోగాల కోసం వెంపర్లాడుతూ పట్టణాలలో పాట్లు పడుతుంటే. శివ మాత్రం తను చదివిన చదువుకు సార్థకత కలిగిస్తూ తన స్నేహితులను సైతం గ్రామాలకు వ్యవసాయం లో విత్తనాల సాగు వైపు మళ్ళిస్తూన్నాడమ్మా. మీ ఇంట్లో చిన్నగది ఖాళీగా ఉందని అది అద్దెకిస్తే , మాకు ఆఫీసుగా ఉపయోగించుకుంటాం. మీకు ఖర్చులకు డబ్బు ఉపయోగపడుతుంది"అన్నాడు ఆ అధికారి. "అయ్యో ఇంతకు ముందెన్నడు అద్దెలకియ్యలేదయ్యా. పైగా గడ్డిల్లు చిన్న గది." అన్నది శాంతమ్మ. "ఫర్వాలేదు ఆంటీ ఈ చిన్నదైనా సరిపోద్ది " అన్నాడు ఒక యువకుడు. "ఇంతకీ ఏం చేస్తారు ఇక్కడ. అసలే ఆడపిల్ల ఉన్న ఇల్లు" అన్నది శాంతమ్మ. "మీ శివ విత్తన వ్యవసాయం గురించి ప్రచారం

పూనాచ్చి- మానవ సంబంధాల కథ

 పూనాచ్చి 2 పెరుమాళ్ మురుగన్ ఆత్తూర్ తమిళంలో రచించిన "పూనాచ్చి " తమిళ నవలకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం 'పూనాచ్చి' ఒక మేక పిల్ల కథ. 2014లో "మాధొరు భాగన్" తమిళ నవలకు ఆంగ్లానువాదం 'వన్ పార్ట్ విమన్'కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. దాని తెలుగు అనువాదమే 'అర్థనారీశ్' . అవార్డు ప్రకటన తర్వాత తమిళనాడులో వివాదాలు మొదలయ్యాయి. పెరుమాల్ మురుగన్ పై కేసులు పెట్టి, అరెస్టు చేయాలని, పుస్తకాన్ని నిషేధించాలని కొన్ని సమూహాలు ప్రయత్నించాయి. మద్రాస్ హైకోర్టు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా, భావప్రకటనా స్వేచ్ఛను గుర్తు చేస్తూ, పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీం కోర్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరు తమ భావాలను వ్యక్తపరచవచ్చని. "పెరుమాళ్ మురుగన్ రచన నచ్చకపోతే కొనకండి , చదవకండి, కానీ ఎవరి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించకండి" అని చెప్పడంతో వివాదం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పుతో "వివాదాలు దాడులతో రచనా వ్యాసంగాన్ని వదిలేస్తున్నాను" అని ప్రకటించిన మురుగన్ తో పాటు అనేకమంది కవులకు రచయితలుకు ధైర్యం

సాయిలుచారి, ముందుమాట

 సాయిలుచారి కవిత్వ సాళ్ళు "కాంతి లేకపోతే నడవగలను, కలలే లేకపోతే సాగడమెట్లా " అంటాడో మహానుభావుడు. కంటి రెప్పలు కత్తిరించుకొని కలలను కాపలా కాయవలసిన సందర్భంలో ప్రస్తుత కవులున్నారు. కవిత్వం రాయడం అంటే కవి తనను తాను ఖండించుకోవడంతో సమానం. కవితా రచన కోసం తపించే వారిలో వడ్ల సాయిలుచారి ఒకరు. విశ్వకర్మ బిడ్డగా పుట్టి, నిరుపేద కుటుంబ పరిస్థితులకు చదువు కొనసాగించలేక విద్యను మధ్యలో వదిలేసి చేతి వృత్తిలో తండ్రికి చేదోడయిన బాధ్యత గల వ్యక్తి మన కవి. తరువాత తన జీవిత శిల్పాన్ని తన ఇష్టప్రకారం నచ్చిన విధంగా తనకు తానే చెక్కుకున్న ఇగరశాలి. దూరమైన విద్యను దూరవిద్య ద్వారా దగ్గర చేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉపాధిని పొందాడు. తాను చూసిన,చదివిన అనుభవించిన జీవితాలను కవిత్వీకరించే దిశగా ప్రయాణం చేస్తున్న క్రమంలో `రుంజ´ కోసం పని చేస్తూ ఒకరికొకరం పరిచయమయ్యాం. అప్పటినుండి 'అక్కా..!' అంటూ ఆదరంగా పిలుస్తూ పలకరించేవాడు. తెలంగాణ ఉద్యమకాలంలో రుంజ ఆ తరువాత వేవా వేదా వంటి వివిధ సంఘాలలో కూడా కలిసి పని చేస్తూ వచ్చాం. 2017 లో ఉద్యోగవిరమణ తర్వాత 'సాహితీవనం మిద్దెతోట'లో గాయాలను మాన్చుకుంటూ

"మూలమలుపు" సమీక్ష

 'మూలమలుపు'లో బతుకు చిత్రాల కవిత్వం. సాహితీలోకంలో ఏనుగు నరసింహా రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి కాక ముందు నుండే ఒక కవిగా సుపరిచితులే. చిన్న పత్రిక నుండి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల వరకు , అన్ని పత్రికల్లోనూ వారి కవిత్వానికి ఎందరో పాఠకులు ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రచనా వ్యాసంగంలో అనేక ప్రక్రియల్లో వారు రచనలు చేస్తున్నారు. ఆంధ్రప్రభలో 2016 నుండి అప్రతిహతంగా ప్రతి వారం రాసే రూబాయిలు వారి సాహితీ వ్యవసాయానికి నిదర్శనం. "పుస్తకాలు లేని ఇల్లు ఎడారి" అని చెప్పే ఈ కవి , తనను కలిసిన అందరికీ పుస్తకాలను జ్ఞాపికలుగా అందిస్తూ అక్షర సేద్యానికి విత్తనాలను పంచుతారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూసీతీరంలోని కల్లోనికుంటలో జన్మించి, నల్గొండ జిల్లా చిట్యాలలో పెరిగిన వీరి ప్రతి అక్షరంలోతెలంగాణ భాషాసౌందర్యం తొణికిసలాడుతుంది. "అంతరంగం" అనే వీరి ఆధునిక కవిత్వ విమర్శ గ్రంథంలో ఇరవై ఆరు వ్యాసాలున్నాయి. వారి సునిశిత పరిశీలన , సున్నితమైన విమర్శకు అద్దంపడుతుంది ఈ "అంతరంగం"అనే పుస్తకం. ఈ

ఆంగ్లానువాదం

 CANNON OF CONFIDENCE Corona, what's your enigma ? Is it fair showing your ugliness at the end of the year name 'Ugly' We are are peace seekers and also strong enough for a war too Dear, why should we worry because of you ? After all what you are ? From Plague, Cholera to recent Swine- Flu every disaster got vanished You can enjoy your dancing procession in 190 countries In India we make you to run tucking tail between your legs Our doctors team have diamond-like determination Our Police are eternak peoples protectors Our rulers guard us like fishes guard oceans, without sleep Our sanitation workers clean every moment of time Now, this four Armies declared war on you, Oh my lonely virus ! Though you run with the speede of air, Your death is invitable The secret of wizard's death is killing the parrot Now we knew your death secret, the blasting your protein cover The print and electronic media too in red alert Our scientist are almost readybfo

ఆత్మవిశ్వాసమే ఆయుధం(కరోనా కవిత)

 ఆత్మవిశ్వాసమే ఆయుధం కరోనా క్యా హై తేరా రోనా వికారి చివరలో వచ్చి నీ వికృతం చూపడం సబబేనా మేము యుద్ధంచేసే సత్తా కలిగిన శాంతికాముకులం కరోనా నీతో మాకెందుకు హైరానా కలరా మసూచి ఎయిడ్స్ నుండి నిన్నటి స్వైన్ ఫ్లూ వరకు ఏది నిలబడ లేదు నువ్వెంత నువ్వు 200 దేశాలు ఊరేగినా ఇండియాలో మాత్రం తోక ముడవాల్సిందే వజ్ర సంకల్పులు మా వైద్య బృందాలు నిరంతరం రక్షిస్తూ మా ప్రజా రక్షకులు రెప్పవాల్చని చేప చూపుల మాపాలకులు ప్రతిక్షణం శుభ్రం చేస్తూ మా కార్మికులు చతుర్విధ దళాలు యుద్ధంలో దిగాయి నువ్వు ఏకైక వైరస్ వి ఎంత వేగంగా పరుగులు పెట్టినా నీ పప్పులు ఉడకవు ఇక్కడ నీపై కొవ్వు పొర ఛేదిస్తే నీ అంత మేనట కదా చిలుకలో ఉన్న మాంత్రికుని ప్రాణంలా నీ రహస్యం తెలిసిపోయింది పత్రికలు ఛానళ్లు పహారా కాస్తూ మా సైంటిస్టులు నీ అంతానికి సిద్దం చేస్తూ నీ అంతు చూస్తారిప్పుడు ఆత్మవిశ్వాసం మా ఆయుధం ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాళ్ళం ఐకమత్యంతో చైతన్య రథం నడిపే వాళ్ళం రోగాలను నిరోధించుకోలేమా క్వారంటైన్లే మా విడిదిళ్ళు స్వయం నియంత్రణ మా పాశుపతాస్త్రం కరోనా క్యా హై తేరా రోనా నిన్ను తరిమే యత్నంలో మేము సైతం అంటూ మ

జిల్లేడు కాయ(కరోనా కథ))

 జిల్లేడుకాయ "కిషన్ రావు సంగతి తెలిసిందా! "గోపాల్రావు "ఏమైంది"వాసు. "హాస్పిటల్లో ఉన్నాడట" గోపాల్రావు. "ఎందుకు మళ్ళేమయింది" వాసు. " అవును ఇంతకుముందు కూడా పదిరోజుల వరకు హాస్పిటల్లో ఉన్నట్టున్నాడు కదా బాయ్" ఆలి. "ఏదో స్కిన్ ఎలర్జీ అట" గోపాల్రావు. "అంతే కాదు గుండెలో మూడు వాల్వులు బ్లాక్. అయినయట" వాసు. "ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు కదా" క్రిష్టఫర్. "అందరికీ పెళ్లిళ్లయ్యాయి కొడుకు అమెరికాలో ఉంటాడు" గోపాల్రావు. " భార్య భర్తలు ఇద్దరే ఉంటున్నారు" వాసు. "అయితే ఏమిలే ఇద్దర బిడ్డలు ఇదే ఊర్లో ఉంటారట కదా బాయ్" ఆలి. "ఎక్కడ ఉంటే ఏముంది బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా" క్రిష్టఫర్. " బాధ్యతలు తీరడం అంటే పెళ్లిళ్లు చేయడం తోటే అయిపోదు" వాసు. "అది కాదు లేరా బాబు, ఇప్పుడు కష్టపడి, పడీపడి అప్పులు చేసేంత అవస్థ లేదని" రామకృష్ణ. "ఎంత చెట్టుకు అంత గాలి, ఎవరికీ ఉండే కష్టం వారికుంటుంది" వాసు. "రేపు ఒకసారి పోయి చూసొద్దాం" గోపాల్రావు. "అప్ప