ఆత్మవిశ్వాసమే ఆయుధం(కరోనా కవిత)

 ఆత్మవిశ్వాసమే ఆయుధం


కరోనా క్యా హై తేరా రోనా
వికారి చివరలో వచ్చి
నీ వికృతం చూపడం సబబేనా
మేము యుద్ధంచేసే సత్తా కలిగిన
శాంతికాముకులం

కరోనా నీతో మాకెందుకు హైరానా
కలరా మసూచి ఎయిడ్స్ నుండి
నిన్నటి స్వైన్ ఫ్లూ వరకు
ఏది నిలబడ లేదు నువ్వెంత
నువ్వు 200 దేశాలు ఊరేగినా
ఇండియాలో మాత్రం తోక ముడవాల్సిందే

వజ్ర సంకల్పులు మా వైద్య బృందాలు
నిరంతరం రక్షిస్తూ మా ప్రజా రక్షకులు
రెప్పవాల్చని చేప చూపుల మాపాలకులు
ప్రతిక్షణం శుభ్రం చేస్తూ మా కార్మికులు
చతుర్విధ దళాలు యుద్ధంలో దిగాయి
నువ్వు ఏకైక వైరస్ వి
ఎంత వేగంగా పరుగులు పెట్టినా
నీ పప్పులు ఉడకవు ఇక్కడ

నీపై కొవ్వు పొర ఛేదిస్తే నీ అంత మేనట కదా
చిలుకలో ఉన్న మాంత్రికుని ప్రాణంలా
నీ రహస్యం తెలిసిపోయింది
పత్రికలు ఛానళ్లు పహారా కాస్తూ
మా సైంటిస్టులు నీ అంతానికి సిద్దం చేస్తూ
నీ అంతు చూస్తారిప్పుడు

ఆత్మవిశ్వాసం మా ఆయుధం
ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాళ్ళం ఐకమత్యంతో చైతన్య రథం నడిపే వాళ్ళం రోగాలను నిరోధించుకోలేమా

క్వారంటైన్లే మా విడిదిళ్ళు
స్వయం నియంత్రణ మా పాశుపతాస్త్రం
కరోనా క్యా హై తేరా రోనా
నిన్ను తరిమే యత్నంలో
మేము సైతం అంటూ మా కలాలు

ఓ నా సహచర బుద్దిజీవుల్లారా
మనజాతి విపత్తులో ఉన్నది
మన కోసం మనం నిలవాలిసిన సమయాన
వ్యక్తిగత దూరం పాటిస్తూ సమిష్టిగా
శుభ్రం శరణం గచ్చామి
త్యాగం శరణం గచ్చామి
దానం శరణం గచ్ఛామి
శాంతం శరణం గచ్చామి
.........
జ్వలిత
9989198943
jwalitha2020@gmail.com
29/3/2020

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష