వె

వెలుగు చూడని విజేత-1 8/3/2018 అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా ఒక విజేతను పరిచయం చేస్తాను. 1988లో పరిచయం అయిందామె నాకు దాదాపు మేమిద్దరం ఎవరి యుద్దాలు వారు వేరువేరుగా చేస్తున్న సమయంలో ఆమె నాకు ప్రేరణ. 1980లో హైదరాబాద్ వచ్చిన నేను1987లో మా వారు పనిచేస్తున్న కంపెనీ లాక్కౌట్ కావడంతో తిరిగి మా అత్తగారి ఊరు గంధంపల్లి వచ్చి హోటల్ పెట్టుకున్నాం ఒక సంవత్సరం తరువాత కంపెనీ ఓపెనయి తిరిగి హైదరాబాద్ వచ్చాం.(ఇక్కడ చాలా చెప్పాలి తరువాత మరొక సారి చెప్తాను) 1988 కుకట్పల్లి బాలాజీనగర్లో అద్దెకు దిగాం దగ్గర్లో ఒక రేకుల ఇంట్లో ఒక నర్స్ ఉండేది ముగ్గురాడపిల్లలతో డా.ప్రతాపరెడ్డి పీపుల్స్ హాస్పిటల్లో పనిచేసేది తర్వాత శివానంద  లెప్రసీ రిహాబిలేటేషన్ సెంటర్లో పనిచేసేది. ఎవరు పిలిచినా వెళ్ళి సూదులేసొచ్చేది. బాధితులకు తనకు తోచిన సేవలు చేసేది. ఆదివారం క్రీస్తు ప్రార్థనలు చేసేది. ఎప్పుడూ సీరియస్ గా ఎక్కువ పనిచేస్తూ తక్కువ మాట్లాడేది. ఆమె నవ్వగా ఎప్పుడూ చూడ లేదు నేను. వాళ్ళ పెద్దమ్మాయి షీబా పరిచయమయ్యింది నాకు. వాళ్ళింటి ముందు నుండి నేను పనిచేసే పాఠశాలకు వెళ్ళేదాన్ని.(బాగంబీర్ లో రామకృష్ణ స్కూల్. రంగారెడ్డి జిల్లా DEO ఆఫీస్. లో పనిచేసే ఉద్యోగి దానికి యజమాని) షీబా ఒకసారి మాఇంటికి జీసస్ ప్రార్థనకు రండీ అని పిలిచింది నన్నేకాదు తనతో మాట్లాడిన ప్రతిఒక్కరిని పిలిచేది మా ఇంటి యజమాని వెళ్ళొద్దనే వాడు. కాని జీవిత యుద్దంలో ఉన్న నేను కొంత అభద్రత లో ఉండే దాన్ని షీబా వాళ్ళ అమ్మలాగే నవ్వే అవకాశం లేని దాన్ని. పిల్లలను తీసుకొని వెళ్ళడం మొదలు పెట్టాను. నేను ఐదో తరగతి హన్మకొండ లో మర్కజీ పాఠశాలలో చదివేప్పుడు ఇంటికి దూరంగా ఉండటం వలన కలిగే భయంతో చర్చ్ కు వెళ్ళేదాన్ని. ఈసారి ఆమె మీద గౌరవంతో పాటు జీవితం సృష్టించిన భయంతో ప్రార్థనలకు వెళ్ళే దాన్ని. ఆమెకు షీభా తరువాత ఒక కొడుకు తర్వాత ఇద్దరు కవలలు అమ్మాయిలు లీనా, సుజన. భర్తబాధితురాలు అని తెలిసింది. అన్నలున్నా ఎవరూ సాయం చేసేవారు కాదు ముగ్గురు పిల్లలను PNM School లో చదివించేది. షీబా చెప్పేది తండ్రి హింస గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా కుటుంభాన్ని పట్టించుకోడని. వేరే ఆమెతో ఉండేవాడని  కొడుకును తనతో ఉంచుకొనేవాడని. ఇంటికి వస్తే తల్లి పిల్లలను హింసించే వాడని వండుకున్న అన్నాన్ని కూరలను ఎత్తేసేవాడని. ఇంట్లోనుంచి ఎల్లిపొమ్మని కొట్టేవాడని. వాళ్ళమ్భ అప్పుడప్పుడు నన్ను తన పిల్లలకు చూపిస్తూ ఆంటీ చూడు ఎంత శ్రమపడతారో అనేది, ఆంటీకి సుఖముంటే ఇంకా అందంగుండేది అనేది. 2018లో 30 సంవత్సరాల తరువాత ఈ మధ్య ఆమె కనపడింది. నేనే పలకరించి మాట్లాడుతూ గతం గుర్తు చేశాను. పిల్లల గురించి అడిగాను షీబా ఇంటర్ వరకు చదివి ప్రైవేట్ జాబ్ చేస్తున్నది పెళ్ళయింది ఇద్దరు పిల్లలు. లీనా సుజానా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లయ్యారు. ఒకరిది బెంగుళూరు ఒకరిది హైదరాబాద్ అంటూ చెప్పింది. షీబాకు ఒక్కదానికి అప్పు చేసి పెళ్ళి చేశా ఇద్దరు చెల్లెళ్ళకు తమ్ముడికి షీబా పెళ్ళి చేసింది. అందరు బిడ్డ కాదు కొడుకులా నిలబడింది అన్నారు. అల్లుడు చాలా మంచివాడు నా పిల్లలు మంచి వాళ్ళు జెమ్స్ అన్నది. అందేంటి కొడుకు మీ దగ్గరుండడు కదా అన్నాను. తండ్రి రిటైర్ అయినంక ఉంచుకున్నామె కొడుకుతో గొడవ పెట్టుకుంది నా దగ్గరకొచ్చాడు. వాడు తండ్రిలాగే రౌడీ. కోడలు నా బిడ్డల్లాగే చాలా బుద్దిమంతురాలు మీ వారు మారారా అన్నాను. మారలేదు పోయారు. రిటైర్ అయినంక స్ట్రోక్ వచ్చి కోమాలోకి పోయారు ఉంచకున్నామె తీసుకొచ్చి మా ఇంటిముందు వేసి పోయింది. సంవత్సరం అన్ని సేవలు చేసా. ఇల్లు కుదువ పెట్టి డబ్బులు ఆమెకిచ్చాడట. జబ్బు రాంగనే అప్పిచ్చినవాళ్ళు వారంలో ఇల్లుకాళీ చేయించారు. పక్క వీధిలో అద్దెకుంటున్నా. ఫెన్షన్ బెనిఫిట్ వచ్చిందా అని అడిగా. చనిపోయిన తరువాత వచ్చేవి నాకు దక్కినయి. విడాకులు ఇవ్వకుండా జీవితాంతం హింసభరించినందుకు పెన్షన్ వస్తోంది. చాలా చెప్పింది ఉద్వేగంతో. నా గురించి అడిగింది. నా చదువు గురించి విని తనకు చదివే అవకాశం దొరకలేదంది. నర్స్ కదా నిలబడే డ్యూటీ నలుగురు పిల్లల బాధ్యత. మగతోడు లేని జీవితం. అన్నలు వాడిని అట్లనే ఉండనీ విడాకులియ్యొద్దు పిల్లల పెళ్ళి కాదు అన్నరు. నా దేవుడు గొప్పవాడు. నా నిజాయితీ నా పిల్లలు నాకు తోడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను గుర్తు పట్టి నాతో ఇవన్నీ మాట్లాడించినందుకు చాలా ధాంక్స్ గాడ్ బ్లెస్ యు అంటూ నా "ఓరు"పుస్తకం చదివిస్తానని సెలవు తీసుకుంది. ఆమె సిస్టర్ లిల్లీ. ఈమె విజేత కాదా..?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష