స్ఫూర్తి

స్ఫూర్తి

— జ్వలిత


యుద్దాలను ఉత్పత్తి చేసేవాని రక్తకాంక్ష నెత్తుటేరులను కలగంటున్నది 

అధికారాహంకారం పాలబడిన గాజా 

భయంకర మృత్యుహేల మోగిస్తున్న బాజా

భీతిల్లిన పసిమోములు 

రక్తమోడే దేహాలు 

నెత్తుటి ముద్దలైన ఖండిత తనువులు

వలస సమూహాల మధ్య 

అణుబాంబై పేలుతున్న భయం


ఆయుధాలను కలగంటూ 

ఆదాయాన్ని పెంచుకునే 

మారణ హోమం 

ప్రకృతి సహజమైన ప్రేమను మరిచి

సామూహిక హనానాలతో 

పైశాచిక మృత్యు క్రీడ 


బాల్యంలోనే పసి జీవితాలకు 

అంత్యక్రియలు లేని 

అంతిమ గీతాలు పాడుతున్నది 

మరణాల జోల

నిస్సహాయ శరణార్థ శిబిరాలు 

గాలి వెలుతురు శూన్యమైనా 

అధికారం అస్తిత్వాన్ని వేటాడుతున్నది 


డాలరు పడగనీడన 

వంద సంవత్సరాలుగా 

సలుపుతున్న పచ్చి గాయం 

శత్రువును ఓడించేందుకు చేస్తున్న 

ప్రతిఘటనే ఒక ఆయుధం

హింసాత్మకంగా ఆపేస్తున్న 

ఉసురుల మధ్య 

ఊపిరి తీసుకోవడమే ధిక్కారం



మానవ జాతి సంరక్షణకై

దేవునితో పోరాడిన 

‘ప్రొమీథీయస్’ స్ఫూర్తి

మానవాళికి ఆదర్శం ఇప్పుడు


      —---------

పాలస్తీనా కవితా సంకలనం డా. గీతాంజలి

18/01/24

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష