3 స్వంత రక్తంలో పరాయితనం

"కాలాన్ని జయిస్తూ నేను"లో మూడో కవిత

"స్వంత రక్తంలో పరాయి తనం"

రాయి తగిలిన అద్దంలా కాపురాలు ముక్కలౌతున్నాయి
ముక్క ముక్కలో వికృత రూపాలు
వికటాట్టహాసపు ధ్వనులు
రక్షణ వలయమవ్వాల్సిన రక్తబంధాలు
స్వార్థపు రంగులు అద్దుకుంటున్నాయి

కుటుంబమంతా అందమే , మరి వికృతమెక్కడిది
దర్పణంలా శ్రతిబింబించాల్సిన సమయం
కటకంలా వక్రీభవనమేమిటి?
రాతి తాకిడికి అద్దం ముక్కలయ్యిందా !
అదృశ్య దెబ్బలకు హృదయం పగుళ్ళు వారిందా!
రాయి నేనే , కటకం నేనే , దర్పణం నేనే ఐతే
గుండె కవాటానికి అడ్డుపడేదిమిటి
స్వార్థపు పొరల భేషిజం
స్వంతరక్తంలో పరాయి తనం
కుటుంబ బంధాలకు పోగులు సన్నబడ్డాయి
మానవ సంబంధాలు పలుచబడ్డాయి
వట్టిపోయిన గోవులు కబేళాలకు
బ్రతికి వున్న బంధాలు వృద్ధాశ్రమాలకు... అంతే

...............
(రచనా కాలం 1990)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష