బతకండి


బతకండి మీరే/ జ్వలిత/22/2/2019, 22/20

బతకండి
మీరు మాత్రమే బతకండి
పక్కవాడిని నిలువునా చంపేసి
తోటి వాళ్ళను పాతాళానికి తొక్కేసి
వాడి పళ్ళెంలోది కూడా నువ్వే బొక్కేసి

బతకండమ్మ
మీరు మాత్రమే బతకండి
మీ కొడుకులను రేపిస్టులని చేసి
మీ సోదరులను సన్నాసులను చేసి
మీ తాత తండ్రుల అహంకారాలని చుట్టుకొని

బతకండి
మీరు మాత్రమే బతకండి
మీ జబ్బలను మీరే చరుచుకొని
మీ తప్పులను మీ చంకల కింద దాచుకొని
చట్టాలను మీ కింద పీఠాలు చేసుకొని

బతకండి
మీరే బతకండి
తెల్లోళ్ళను తరమాటానికి
వందలేళ్ళు భరించినోళ్ళం కదా
మరేం పర్వాలేదు మీరే బతకండి

బతకండి
మీరే బతకండి
నీకో గుంపు వాడికో గుంపు
నీ చేతిలో డప్పు డబ్బా
వాడి చేతిలో డబ్బు ఆయుధం
అధికారం కోసం నువ్వు ప్రయత్నించకు

ఇద్దరూ
అంతా బాగుందని అంత్యప్రాసలతో రాసివ్వండీ
మా పిల్ల కుంకలు బట్టీ పట్టి చదువుకుంటరు
ఊళ్ళూ అడవులే కాదు సరిహద్దుల్లో కూడా
మీ కిరాయి కత్తులకు మా దేహాలుంటాయిలే
బతకండి
మీరే బతకండి

....... 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష