పచ్చటి ఆశలు


పిడికెడు మట్టి , చిటికెడు గింజలు
పురిసెడు నీళ్ళను పట్టుకుని
ఒంటిరెక్కతో ఒంటరిగా పైకి పోతున్నా
ముందున్న వారికి వందనం
మరో రెక్కై మొలిచి
పచ్చగ నిలిచే వారికి స్వాగతం
ప్రకృతి పరిణయాన
ప్రణయలేఖలకు పత్రహరితాన్ని
కలగంటూ ఉద్యమం
జీవామృతానికి పసరువైద్యం చేయాలి
పసిమొక్కగా రూపంతరం పొందాలి మనం
రేపటి ప్రపంచానికి తడి స్పర్శ చెప్పి
పచ్చటి ఆశల జల్లులకు
ప్రతి అణువు మొలకలు మొలకలుగా
అంకురించాలి
వచ్చేప్పడు వట్టి చేతులతోనే కదా వచ్చాం
పోయేది కూడా కాళీ చేతులతోనే
నానా గడ్డితో సకలవిషాలను మేస్తూ
మనసులతోపాటు దేహాలకు నింపుతూ
మనం అందరం కదలాడే శ్మశానాలు అవుతున్నాం
నివారణ మొదలవ్వాలిసిన తరుణం ఇది
మనలో తడి ఆరకముందే
ఇంటి పంటలై చిగురిద్దాం రండి
మరో మొదటి రోజున ప్రతినబూని
ప్రగతిశీల పచ్చదనమౌదాం రండి
మిద్దెతోటలై మనమంతా విస్తరిద్దాం రండి
• ..........
జ్వలిత/9989198843





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష