గల్పికాతరువు పుస్తకానికి బి.ఎస్. రాములు గారి ముందు మాట

 మర్రి విత్తనం వంటి గల్పిక

——-

ఒక పేజీ కథలు, గల్పికలు రాయించి ఒక సంకలనం తేవాలనేది జ్వలిత సంకల్పం. గల్పికలు రాయడానికి ఇదొక ప్రాక్టికల్ వర్కు షాప్. ఇదొక చక్కని ఆలోచన. సంకల్ప బలం వల్ల అది సాకారమైంది. కదిలించే వారుంటే ఎంతైనా కదులుతారు అనడానికి ఇదొక నిదర్శనం. 

  ఒక పేజీ కథ గాని, గల్పిక గాని రాయడం కొత్తవారికి సులభం కాదు. పాత వారికి గల్పిక సులభం. ఇందులో కొత్తవారున్నారు పాతవారున్నారు. పేజీ కథ, గల్పిక పాతవే కానీ ప్రచారం అవసరమైన ప్రక్రి. గల్పిక రీతి వేరు. కథ రీతి వేరు. ఇందులో చాలా మేరకు గల్పిక లక్షణాలతో ఉన్నాయి. సకాలంలో రాసిన వారందరికి అభినందనలు.

       పేజీ కథలు, అంతకన్నా చిన్న కథలు రాయడం ఫత్రికల్లో రావడం చూశాను నేను.  నేడు అనేక  దిన వార మాస పత్రికలు , చతుర విపుల, వంటి పత్రికలు ప్రతినెల పేజీ కథలు, చిన్న కథలు, గల్పికలు, అచ్చు వేస్తూనే ఉన్నాయి. కొడవటిగంటి కుటుంబరావు వ్యంగ్య కథనాలను గల్పిక అనే పేరుతో రాసాడు. సరిగ్గా రాస్తే అది గుండెలకు తాకుతుంది. 1983 లో "బాతాల పోశెట్టి", "ఏతుల ఎంకటి" పేరుతో కొన్నిటిని నేను కూడా రాసిన. 

మా చిన్నప్పుడు  కార్డు కథలు అని ప్రత్యేకంగా ప్రచురించేవారు. పంచ తంత్రం కథలు పేజీ కథల వంటి చిన్న కథలే! చందమామను, బాలమిత్ర, బొమ్మరిల్లు, బాలజ్యోతి, వంటి పిల్లల పత్రికలు, వార్త దిన పత్రిక అనేక చిన్న కథలు , గల్పికలు ప్రచురించాయి. 

   రెండు గంటల పాటు తీసే సినిమాకు ఒక పేజీలో  కథ రాసే వారున్నారు. అందులోనే మొదటి సగం, రెండో సగం అని రెంటిని అసక్తికరంగా రాస్తుంటారు. టీవీ సీరియల్ కు కూడా మూలకథ పేజీ కూడా రాయరు. కాని సీరియల్ నెలల తరబడి సాగుతూనే ఉంటుంది.  సినిమా, టీవీ పరిభాషలో  సింగిల్ లైన్లో కథ చెప్పు. ఫస్టు హాఫ్, సెకండ్ హాఫ్ ఎలా వుంటుందో చెప్తారు. చర్చిస్తారు.  మహావృక్షం మర్రిచెట్టు కూడా ఒక చిన్న విత్తనం నుంచే ఆవిర్భవిస్తుంది. 

    ఇలా వాక్యం హింసాత్మకం కావ్యం అన్నమాటలు దృశ్య ప్రక్రియలు అద్బుతంగ సాకారం చేస్తున్నాయి. ఈ సంకలనంలోని గల్పికలు ఎన్ని సినిమాలకు, సీరియళ్ళకు, షార్ట్ ఫిల్ములకు స్పూర్తినిస్తాయో, మూలకథలవుతాయో ఎవరికి తెలుసు? ప్రతి ఒక్కరు తమ లైబ్రరీల్లో ఇటువంటి ప్రయోగాత్మక సంకలనాలను ఉంచాలి, కొత్త పాఠకులకు పిల్లలకు ఉపయోగపడతాయి. కథకులకు, గల్పికా కారులకు సంకలనానికి  రూపం ఇచ్చిన  జ్వలిత గారికి అభినందనలు.

-  

                                    బి. ఎస్. రాములు

తెలంగాణ తొలి బీ.సీ. కమీషనర్.

హైదరాబాద్,

23-11-2020.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష