మేమెవరం


memevaram మేమెవరం/ జ్వలిత మీకు కడకో నడిమిట్లనో గూడో మేడో ఏదో ఒకటున్నది నిలవ నీడ లేనోళ్ళం దేశదిమ్మరులం మా సంగతేంది ఎర్రదో తెల్లదో ఏదో ఒక కారటున్నది బత్తెమిచ్చటందుకు ఏ కార్డు లేనోల్లం సంచార జాతులం మా బతుకేంది చిన్నదో పెద్దదో ఏదో ఒక కొలువున్నది మీకు బతుకు తెరువుకు ఏదిలేని బహురూపు గాళ్ళం మా ఉనికేంది మీకు కోడో మేకో చివరాకరికి సూకరమో ఉన్నది పసందుగ విందులు చేసేందుకు అడవి పచ్చులు గూడ దొరకని పిట్టలోళ్ళం బతికేదెట్ల మేం అన్నమెతక్కు కరువు అచ్చరమెట్ల దొరుకుతది మాకు అడ్రసు లేనోళ్ళం ఆధారెక్కడుంటది మాకు ఓటు లిష్ట్ లేనోళ్ళం జనాభాలెక్కల ఎట్లుంటం అప్పు కింద అమ్ముతడొకడు ఖర్చుల కింద జమేస్తడొకడు తప్పు కింద కాలె నూనెల కాలుస్తడొకడు సాదలేక సంపుతడొకడు కట్టుబాటంటడొకడు కులం తీరంటడొకడు కట్టుకున్నోడు కన్నోడు కంటపడ్డ ప్రతోడు మా పాలి యములోళ్ళే మాకే చట్టం లేదు ఏ చట్టు బండల్లేవ్ మేము ఈ దేశపోళ్ళం కామా? మాది ఏ దేశం? మాకు న్యాయం చేసేదెవరు? అంబేద్కర్ మాకు లేడా? పూలే ది మా వాడ కాదా? బుద్దుడి ధర్మం మాకు చెందదా? గంగిరెద్దులోళ్ళ పిచ్చకుంట్లం భోగమోళ్ళం పూసలోళ్ళం మందులోళ్థం కాటి కాపరులం బైండ్లోళ్ళం డెక్కలోళ్ళం బండొడ్డెరోళ్ళం బజారుకమ్మరోళ్ళం వీధినాటకలోళ్ళం బైరూపులోళ్ళం సంచార జాతులం మీ నోరు తిరుగనోళ్ళం మా కడుపు నిండనోళ్ళం ఏ ఎజెండా ఎరుగనోళ్ళం ఏ పార్టీకి యాదికి లేనోళ్ళం మేమెవరం ? మా దేశమెక్కడ ? మేం భారతీయులం కాదా ? ఏ మా కొడుకు యిక నాయకుడు కాడా..? మేమెవరం..? ====(((=)))===== జ్వలిత-9989198943 16/04/2016(12AM) POSTED BY జ్వలిత AT 9:14 AM NO COMMENTS: Post a Comment Older Post Home Subscribe to: Post Comments (Atom) నచ్చిన బ్లాగులు కూడలి జాన్ హైడ్ కనుమూరి నానోలు నెలనెలా వెన్నెల ప్రజాకళ లక్ష్మీ యాకూబ్ సాహిత్యం తెలుగు సాదనాలు లేఖిని కవితలు vyaasaalu (1) రిపోర్టులు (1) సాహిత్య కార్యక్రమాలు (2) BLOG ARCHIVE ▼ 2016 (3) ▼ April (3) memevaram బానిసకు బానిస సన్మానం ► 2013 (4) ► 2010 (6) ► 2009 (12) ► 2007 (2) నా గురించి My photo జ్వలిత VIEW MY COMPLETE PROFILE

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

జిల్లేడు కాయ(కరోనా కథ))