బానిసకు బానిస బానిసకు బానిస/ జ్వలిత నేను శత్రు శిబిరం లో శరణార్థిని నా జీవితం నిర్ణయాత్మక వెలివాడ నా గాయం తడి ఆరిన ఎడారి నా గళం అనివార్య యుద్దాల నడుమ ఆత్మగౌరవ గీతాలాపన నా కలం అస్తిత్వ ప్రసవాల ఆర్తనాదం నాకు పాఠకులుండరు ప్రేక్షకులు కూడా ఉండరు నిత్యం పహారా కాస్తూ శత్రు సైన్యం నా చుట్టూ నా అవసరాల ఉనకి ఉండదు నా హక్కుల చర్చ ఉండదు నా ఊహలను, వ్యూహాలను దోచుకొని మరొకరి విజయ గాథల ప్రచారం నిత్యం సముద్ర ఘోష నడుమ నా బృందం భజన నా నాయకుడు చెంచాలకు గ్లాసులందిస్తూ ఒకసారి గాజులందిస్తూ మరొకసారి మురికి గుంటల్లో దొర్లుతుంటాడు నా సహచర బృందం అరమోడ్పు కన్నులతో నా చరిత్రను తాకట్టు పెడుతూ జాతర చేస్తారు నేను శత్రు శిబిరంలో శరణార్థిని(saranaardhi) నేనొక బానసకు బానిసను నేనొక బీసీని ------===--------- జ్వలిత- 9989198943 13/04/2016,(3.30pm) POSTED BY జ్వలిత AT 9:06 AM NO COMMENTS:

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

జిల్లేడు కాయ(కరోనా కథ))